నందమూరి హీరో కోసం మెగా టైటిల్..?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది డెవిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Update: 2024-06-27 07:45 GMT

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది డెవిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాని తర్వాత ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ జోనర్ లో కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు.

మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని ఈ ఏడాదిలో కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి విజయశాంతి క్యారెక్టర్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వైజయంతీ ఐపీఎస్ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి ఈ చిత్రంలో కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కార్పొరేట్ లుక్ లో కళ్యాణ్ రామ్ స్టైల్ ఉంది. అతని పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మెరుపు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెరుపు టైటిల్ తో మూవీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఆ తరువాత ఇంకెవరు మెరుపు టైటిల్ ని ఉపయోగించుకోలేదు. తన సినిమాకి మెరుపు టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారంట. మేగ్జిమమ్ ఇదే టైటిల్ ని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

త్వరలో టైటిల్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంట. ముప్పా వెంకయ్య చౌదరి, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన అమిగోస్, డెవిల్ రెండు డిజాస్టర్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ కచ్చితంగా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నారు. మెరుపు మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

దీని తర్వాత కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ బింబిసార సీక్వెల్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. వశిష్ట మల్లిడి బింబిసార2 నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ సినిమాని ఎవరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ చేస్తాడా అనే ఆసక్తి అందరిలో ఉంది. అలాగే మరో రెండు కథలపై కళ్యాణ్ రామ్ చర్చలు జరుపుతున్నారు.

Tags:    

Similar News