ముంబైలో క‌మ‌ల్ ఆర్ ఖాన్ అరెస్ట్?

ఈ పోస్ట్ ప్రకారం KRK 2016 కేసులో ముంబై పోలీసులు తనను విమానాశ్రయంలో ఉండ‌గా అరెస్టు చేసినప్పుడు.. తాను న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్‌కి వెళ్తున్నట్లు చెప్పాడు.

Update: 2023-12-25 18:30 GMT

వివాదాల‌తొ హెడ్‌లైన్స్‌లో ఉండటానికి ఇష్టపడే నటుడు కం క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే గా సుప్ర‌సిద్ధుడు) తనను ముంబైలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అతడి అధికారిక X హ్యాండిల్ లో ఈ వార్త‌ను పోస్ట్ చేసి వెంట‌నే తొల‌గించాడు. ఈ పోస్ట్ ప్రకారం KRK 2016 కేసులో ముంబై పోలీసులు తనను విమానాశ్రయంలో ఉండ‌గా అరెస్టు చేసినప్పుడు.. తాను న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్‌కి వెళ్తున్నట్లు చెప్పాడు. తన ఇటీవలి చిత్రం టైగర్ 3 పరాజయానికి సినీ నటుడు సల్మాన్ ఖాన్ తనను నిందించాడని, ఒకవేళ తాను జైలులో చనిపోతే, అది హత్య అని తెలుసుకోండి! అని కేఆర్కే చెప్పాడు.

గత ఏడాదిగా నేను ముంబైలో ఉన్నాను. నేను నా అన్ని కోర్టు తేదీలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నాను. ఈ రోజు నేను కొత్త సంవత్సర వేడుక‌ల‌ కోసం దుబాయ్ వెళ్తున్నాను. కానీ ముంబై పోలీసులు విమానాశ్రయంలో నన్ను అరెస్ట్ చేశారు... అని ఒక పోస్ట్ లో ఆవేద‌నను క‌న‌బ‌రిచాడు. ``నేను 2016లో ఓ కేసులో వాంటెడ్‌గా ఉన్నాను. నా వల్లే తన #టైగర్3 సినిమా ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. నేను ఏ పరిస్థితుల్లోనైనా పోలీస్ స్టేషన్‌లోనో, జైల్లోనో చనిపోతే అది హత్య అని మీరందరూ తెలుసుకోవాలి. .. `` అని KRK ఒక పోస్ట్‌లో తెలిపారు. KRK తన పోస్ట్‌తో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌హా అనేక మీడియా ఛానెల్‌లను ట్యాగ్ చేశారు. తర్వాత అతని అధికారిక హ్యాండిల్ నుండి పోస్ట్ తొలగించారు.

KRKపై మునుపటి కేసులు

తోటి నటీనటులు చిత్ర పరిశ్రమలోని ఇతర ప్రముఖులపై అగౌరవ వ్యాఖ్యలతో క‌మ‌ల్ ఖాన్ ముఖ్యాంశాలలో నిలిచాడు. దివంగత నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌లపైనా కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు 2020లో ముంబై పోలీసులు KRKని అరెస్టు చేసారు. అరెస్టులు అతడికి ఇదే మొదటిసారి కాదు. అతడు (కెఆర్‌కె) దేశద్రోహి అనే సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చాడు. భారతదేశానికి గర్వకారణమైన ఇర్ఫాన్ ఖాన్ మరణించిన తర్వాత, అతడు అతనిపై పేలవమైన వాదనలు ప్రకటనలు చేసాడు. అతను సీనియర్ నటుడు దివంగత రిషి కపూర్ గురించి కూడా చెత్తగా మాట్లాడాడు.

Tags:    

Similar News