ఇండియన్ 3 కంటే ముందు.. ఓ ప్లాన్!
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు.
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. ఒకప్పుడు ‘ఇండియన్’ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ లో కమల్ హాసన్ నటవిశ్వరూపం చూపించారు. అయితే ‘ఇండియన్ 2’ విషయంలో సేనాపతి క్యారెక్టర్ ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేదు. ఆయనకు యాక్టింగ్ పరంగా ఎవరు వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ‘ఇండియన్ 2’లో సేనాపతి గెటప్ అంత పెర్ఫెక్ట్ గా కమల్ హాసన్ ని సెట్ కాలేదనే మాట ప్రేక్షకుల నుంచి వినిపించింది.
ఈ సినిమా ఇప్పటికే శంకర్, కమల్ హాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారబోతోందని కన్ఫర్మ్ అయిపొయింది. ‘ఇండియన్ 2’ సినిమా లాసెస్ లైకా కాబట్టి తట్టుకుంది కానీ వేరొకరైతే పరిస్థితి మరోలా ఉండదేమో. ‘ఇండియన్’ సినిమా సీక్వెల్ ని శంకర్ రెండు భాగాలుగా 500+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రెండు భాగాలని బ్యాక్ టూ బ్యాక్ ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ‘ఇండియన్ 2’ రిలీజ్ తర్వాత సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు.
కోలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ‘ఇండియన్ 2’ మారింది. ఇదిలా ఉంటే ‘ఇండియన్ 2’ తర్వాత కమల్ హాసన్ నుంచి ‘ఇండియన్ 3’ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ భావించారు. అయితే కమల్ హాసన్ అంతకంటే ముందుగా మరో సినిమాని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో చేస్తోన్న ‘థగ్ లైఫ్’ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మణిరత్నం, శంకర్ కాంబినేషన్ లో 38 ఏళ్ళ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ‘థగ్ లైఫ్’ పై భారీ హైప్ ఉంది. మూవీ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. ‘ఇండియన్ 3’ మీద కమల్ హాసన్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. అయితే అంతకంటే ముందుగా ‘ఇండియన్ 2’తో వచ్చిన నెగిటివిటీని తగ్గించాలని అనుకుంటున్నారంట. ‘థగ్ లైఫ్’ తో సక్సెస్ అందుకుంటే ప్రేక్షకుల మైండ్ సెట్ డైవర్ట్ అవుతుంది. అందుకే సినిమాకు ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్స్ కోసమే గట్టిగా ఖర్చు చేసి సినిమాను జానాల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నారట. ఆ సినిమా ఏమాత్రం క్లిక్కయినా ‘ఇండియన్ 3’ కి కొంత పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అందుకే కమల్ హాసన్ ముందు ‘థగ్ లైఫ్’ రిలీజ్ చేసి ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో ‘ఇండియన్ 3’ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకుంటున్నారంట. ‘ఇండియన్ 3’ మూవీ షూటింగ్ 25 రోజులు పెండింగ్ ఉందంట. ఆగష్టు లేదా సెప్టెంబర్ నాటికి ఈ పెండింగ్ షూట్ కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పై శంకర్ దృష్టి పెట్టనున్నాడు. శంకర్ కూడా ‘గేమ్ చేంజర్’ తో సక్సెస్ అందుకొని తరువాత ‘ఇండియన్ 3’ని థియేటర్స్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారంట.