.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

శంక‌ర్‌తో 2.0 - రోబో చిత్రాల ఆఫ‌ర్ వ‌చ్చినా కానీ!

90ల‌లో 'రోబో' సినిమా చేయడానికి తాను ఆస‌క్తి చూప‌లేద‌ని ఈ ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్ హాస‌న్ వెల్ల‌డించారు

Update: 2024-06-30 15:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్ర‌భావవంత‌మైన టాప్ 5 నటులలో క‌మల్ హాసన్ ఒకరు. వంద‌లాది చిత్రాల్లో న‌టించిన మేటి అనుభ‌వ‌జ్ఞుడు అత‌డు. బాల‌న‌టుడిగా కెరీర్ ప్రారంభించి స్టార్ గా ప‌రిశ్ర‌మ‌లో ఒక హోదాను సంపాదించుకున్నారు. దాదాపు అన్ని ప‌రిశ్న‌మ‌ల్లో న‌టుడిగా చెరగని ముద్ర వేశారు. అత‌డు న‌టించిన భార‌తీయుడు 2 చిత్రం 12 జూన్ 2024న విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను శంక‌ర్ ఆఫ‌ర్ చేసిన రోబో - 2.0 చిత్రాల‌ను ఎందుకు వ‌దులుకున్నారో తెలిపారు.

90ల‌లో `రోబో` సినిమా చేయడానికి తాను ఆస‌క్తి చూప‌లేద‌ని ఈ ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్ హాస‌న్ వెల్ల‌డించారు. పింక్‌విల్లా మాస్టర్‌క్లాస్ డిస్క‌ష‌న్ లో క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ.. లుక్ టెస్ట్ తర్వాత 90వ దశకంలో శంకర్‌తో `రోబో` చేయాల‌నే ఆలోచన అప్ప‌టికి స‌రైనది కాద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌మ‌ల్ తెలిపారు. ఐ-రోబోట్ ఒక ఆంగ్ల నవల కాబట్టి మేము (కమల్ హాసన్, శంకర్, రచయిత్రి సుజాత) విభిన్న ఆలోచనలపై చ‌ర్చించుకునేవాళ్ళం. నేను అలా(రొబోలా) చేయాలని సుజాత రంగ‌రాజ‌న్ భావించారు. లుక్ టెస్ట్ పూర్తి చేసాం. కానీ చిత్ర పరిశ్రమ సంక్లిష్టమైన పరిశ్రమ. నా రెమ్యునరేషన్, నా తేదీలు, నా సమయం, ఆ సీజ‌న్ లో మార్కెట్‌ సహా చాలా క్లిష్టమైన వ్యాపార సమీకరణాల కార‌ణంగా నేను చివ‌రికి చేయ‌కూడ‌ద‌ని డ్రాప్ అయ్యాను. కానీ నా స్నేహితుడు శంకర్ సరైన సమయంలో దానిని ర‌జ‌నీతో పూర్తి చేసి రిలీజ్ చేసాడు. ఎవరైనా సరైన కాలంలో ఎంచుకొని ప్రయోజనం పొందగలరని నిరూప‌ణ అయింది... అని తెలిపారు.

Read more!

2 పాయింట్ 0లో రజనీకాంత్ కి విల‌న్‌గా నటించే ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారో కూడా కమల్ హాసన్ వెల్ల‌డించారు. ప్రాజెక్ట్‌తో లింక‌ప్ చేసిన‌ ప్రతి ఒక్కరికీ స్క్రీన్‌స్పేస్ ఉంటే అది ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ అవుతుందని తెలిసి చేయ‌లేదు అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ``నేను మరికొంత కాలం హీరోగా ఉండాలని అతనితో (శంకర్) చెప్పాను`` అని క‌మ‌ల్ స‌ర‌దాగా అన్నారు. అయితే శంక‌ర్ తో ఆ రెండు ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించినా కానీ, తాను స్నేహితుల‌ను కలుస్తుంటాన‌ని, తాము ఎప్పుడూ కలిసి ఒక చిత్రంలో పనిచేయడం గురించి చర్చిస్తామ‌ని క‌మ‌ల్ ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

భార‌తీయుడు 2 జూన్ 12న‌ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు నటిస్తున్నారు. భార‌తీయుడు 2 తర్వాత భార‌తీయుడు 3 కూడా ఉంటుందని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఇది హిందుస్తానీ 2 విడుదలైన 6 నెలల్లోపు విడుదల కానుంద‌ని వెల్ల‌డించారు.

Tags:    

Similar News