కృష్ణంరాజు వార్నింగ్ ఇచ్చారు: క‌మ‌ల్ హాస‌న్

ప్రభాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజు తనను హెచ్చరించిన విషయాన్ని విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు.

Update: 2024-06-26 04:41 GMT

ప్రభాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజు తనను హెచ్చరించిన విషయాన్ని విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు. క‌మ‌ల్ హాస‌న్, ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `కల్కి AD 2898` ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ క‌థానాయ‌కుడిగా క‌నిపిస్తుండ‌గా, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన విల‌న్‌గా న‌టించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇత‌ర కీల‌క‌ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల తారల మధ్య చిట్-చాట్‌లో కమల్ హాసన్ తమిళ- తెలుగు చిత్ర పరిశ్రమలలోని వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు.

రెండు ప్రధాన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల మధ్య పోలికలను క‌మ‌ల్ విశ్లేషించారు. క‌మ‌ల్ తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ముఖ్యమైన సలహాలు పొందిన సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని ... ఒక‌ ఫార్మాట్ ఏర్ప‌డి.. ప్రామాణికంగా ఎలా మారిందో విశ్లేషించారు క‌మ‌ల్. అప్ప‌ట్లో సెట్స్ ఎప్పుడూ సైలెంట్ గా ఉండేవని, ఆ వాతావరణం తనకు బాగా నచ్చేద‌ని క‌మ‌ల్ అన్నారు.

అసిస్టెంట్ డ్యాన్సర్‌గా పనిచేసిన తన పాత రోజులను గుర్తుచేసుకున్న క‌మ‌ల్ హాస‌న్... ప్రభాస్ పెద తండ్రి గారు, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుతో త‌న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఒకసారి సెట్లో తనను పక్కకు తీసుకెళ్లి, కష్టమైన స్టెప్స్‌ను ప్రదర్శించలేకపోవడం వల్ల మళ్లీ అలాంటివి చేయవద్దని హెచ్చరించారు. వాటిని ప్రయత్నించగలరు.. కానీ రిస్క్ తీసుకోవ‌ద్ద‌ని కృష్ణంరాజు సూచించిన‌ట్టు క‌మ‌ల్ వెల్ల‌డించారు.

`కల్కి AD 2898` జూన్ 27(గురువారం)న‌ థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రీ-సేల్స్ బుకింగ్‌లు అద్భుతంగా ఉన్నాయ‌ని స‌మాచారం. భారతదేశంలో ఇప్పటికే 2,00,000 కంటే ఎక్కువ టిక్కెట్లు సేల్ అయ్యాయి. రిలీజ్ మందే క‌ల్కి భారతదేశంలో 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాల‌ర్లు ఇప్ప‌టికే వ‌సూలు చేసింది.

Tags:    

Similar News