క్వీన్ పెళ్లికి రెడీ అంటోంది.. అప్లికేషన్ పెట్టుకుంటారా?
అదే క్రమంలో అప్పులు తీర్చుందుకు ముంబైలోని తన ఆఫీస్ కార్యాలయాన్ని కంగన అమ్ముకోవాల్సి వచ్చిందని మీడియాలో కథనాలొచ్చాయి.
వివాదాలతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది క్వీన్ కంగన. భాజపా తరపున పోటీ చేసి ఎంపీ అయ్యాక మరింతగా చెలరేగి కామెంట్లు చేస్తోంది. రాజకీయాలు తనకు చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నా దేనికీ తలవొంచడం లేదు. కంగన నటించి స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన `ఎమర్జెన్సీ`ని రిలీజ్ కానివ్వకుండా కొన్ని సిక్కు గ్రూపులు అడ్డుకట్ట వేస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో అప్పులు తీర్చుందుకు ముంబైలోని తన ఆఫీస్ కార్యాలయాన్ని కంగన అమ్ముకోవాల్సి వచ్చిందని మీడియాలో కథనాలొచ్చాయి.
అదంతా అటుంచితే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కంగన తాను చేయాల్సినది చేస్తూ పోతోంది. తాజాగా
కంగనా రనౌత్ తన వివాహ ప్రణాళిక గురించి వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి పార్లమెంటు సభ్యురాలు అయ్యాక తన ఆలోచన మారినట్టే కనిపిస్తోంది. తాను కూడా పెళ్లాడి ఒక కుటుంబాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నానని క్వీన్ తాజా చాటింగ్ సెషన్‌లో తెలిపింది. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని న్యూస్ 18 షోషాలో కనిపించిన సందర్భంగా చెప్పింది. అయితే ప్రస్తుత MP టర్మ్ సమయంలో వివాహం జరుగుతుందా? అని ప్రశ్నించగా కంగనా బదులిస్తూ .. ప్రస్తుత గడువు ముగిసిన తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నాను అని అంది.
పెళ్లి చేసుకోవాలనుందని కంగనా రనౌత్ బహిరంగంగా చెప్పడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు రాజ్ షమణితో పోడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ.. జీవితంలో తోడు ఉండాల్సిన ప్రాముఖ్యత గురించి కంగనా మాట్లాడింది. తోడు లేకుండా ఉండటం కష్టం. ఒకరుగా ఉండటం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరికి తోడు ఉండాలి. సహచరుడు లేకుండా చాలా కష్టం అని వ్యాఖ్యానించింది. కంగనా రనౌత్ చివరిసారిగా 2023 చిత్రం తేజస్‌లో కనిపించింది. సర్వేష్ మేవర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్లాపైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కానుంది.