కంగన వేగానికి రాజకీయం బ్రేక్!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి గెలవడంతో బరువైన బాధ్యత ఉంది.
బాలీవుడ్ క్వీన్ కంగన వేగానికి రాజకీయం బ్రేక్ వేస్తోందా? ప్రోఫెషనల్ గా కంగన దూకుడు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటే అవుననే అనిపిస్తుంది. కంగన దూకుడు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అన్యాయం జరిగిందంటే కంగన ఒంటికాలుపై నిలబడి శివతాండవం ఆడేసేది. ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా తాను చెప్పాలనకున్నది మీడియా ముందుకొచ్చి నిర్మొహమాటంగా చెప్పేసేది.
అది కాస్టింగ్ కౌచ్ కావొచ్చు..ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయం కావొచ్చు... నెపోటిజంపై కావొచ్చు! ఇలా అంశం ఏదైనా కంగన మీడియా మందుకొచ్చిందంటే ప్రత్యర్ధులకు రీసౌంట్ ఉండేది కాదు. చాలా వరకూ ఆమె వ్యాఖ్యల్ని ఖండించిన సందర్భాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ ఇకపై అంత దూకుడుగా వ్యవహరించే అవకాశం లేదనిపిస్తుంది. ప్రస్తుతం కంగన బీజేపీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి గెలవడంతో బరువైన బాధ్యత ఉంది. ఓవైపు పార్టీకి మద్దతిస్తూ ప్రతిపక్ష పార్టీపై నిప్పులు చెరగాల్సిన అవసరం అంతే ఉంది. ప్రోఫెషనల్ గానూ ఎంతో బ్యాలెన్స్ గా మాట్లాడాల్సిన సన్నివేశం కూడా ముందుంది. అయితే కంగన ఈ విషయంలో ఇప్పటికే అలెర్ట్ అయినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆమె నటించిన `ఎమర్జెన్సీ` చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని భావించింది. కంగన స్వీయా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎర్పడిన ఎమెర్జెన్సీ కాలాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. పొలిటికల్ నేపథ్యం గల సినిమా కావడంతో ఎన్నికల ముందు రిలీజ్ చేస్తే ఆ ప్రభావం కంగర రాజకీయ జీవితంపై పడుతుంది? అన్న కారణంగానే రిలీజ్ చేయలేదంటూ తాజాగా వెలుగులోకి వస్తుంది.
ఇందిరాగాంధీ అంశమంటే? కాంగ్రెస్ ప్రభుత్వంతో ముడిపడిన అంశం. కంగన బీజీపీ పార్టీకి మద్దతిచ్చింది. ఎన్నికల వేడిలో ఆ సినిమా రిలీజ్ అయితే పార్టీ పరంగా దెబ్బ పడే అవకాశం ఉంటుందని, కంగనపై బీజేపీనే విమర్శలకు దిగే అవకాశం ఉందని భావించి ఆమె రిలీజ్ ని వాయిదా వేసినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతుంది. పైగా సినిమాలో నెగిటివ్ కోణం ఎలా ఉంటుంది? పాజిటివ్ కోణం ఎలా ఉంటుంది? అన్నది సినిమా తీసిన కంగనకి మాత్రమే తెలుసు.
రిలీజ్ తర్వాత అది బ్యాలెన్స్ తప్పితే రెండు పార్టీ ల నుంచి కూడా తీవ్ర విమర్శలు తప్పవు. కంగన ఇవన్నీ ముందుగానే బేరీజు వేసుకుని తెలివిగా రిలీజ్ ని సెప్టెంబర్ కి వాయిదా వేసినట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది.