కంగనకు ఇద్దరు గన్ మెన్లు దేనికి?
ఇటీవల హైదరాబాద్ లో మీడియా ఇంటర్వ్యూలతో కంగన బిజీ బిజీగా గడిపేస్తోంది.. చంద్రముఖి 2 ప్రమోషన్స్ హడావుడిలో ఉంది. అయితే తనతో పాటే ఎప్పుడూ ఇద్దరు గన్ మెన్ లు ఎందుకు ఉంటారు?
క్వీన్ కంగన రనౌత్ ఏం చేసినా సంచలనమే. సినిమాలు వివాదాలతో ఈ భామ నిరంతరం బిజీ బిజీ. కారణం ఏదైనా కానీ తనని కనిపెట్టుకుని ఉండటానికి ఇద్దరు గన్ మెన్లు ఎప్పుడూ తన వెంటే కాపలా ఉంటారు. తినేప్పుడు తాగేప్పుడు నడిచేప్పుడు సెట్లో ఉన్నప్పుడు కూడా వీళ్లు కంగనను విడువరు. అయితే అంత టైట్ సెక్యూరిటీ ఈ అమ్మడికి అవసరమా? అంటే .. దీనికి సమాధానం కంగన నోట వెలువడింది.
ఇటీవల హైదరాబాద్ లో మీడియా ఇంటర్వ్యూలతో కంగన బిజీ బిజీగా గడిపేస్తోంది.. చంద్రముఖి 2 ప్రమోషన్స్ హడావుడిలో ఉంది. అయితే తనతో పాటే ఎప్పుడూ ఇద్దరు గన్ మెన్ లు ఎందుకు ఉంటారు? అంటూ తెలుగు మీడియాకు సందేహాలొచ్చాయి. అలా తనకు పహారా కాస్తున్నారంటే లైఫ్ థ్రెట్ ఉందనే దీనర్థమా? అంటే అవుననే కంగన అంగీకరించింది. బెదిరించారు గనుకే ఈ సెక్యూరిటీ అని తెలిపింది.
అంతగా క్వీన్ శత్రువులను మూటగట్టుకుందని దీనిని బట్టి అర్థమైంది. క్వీన్ ఇటీవల చెలరేగి రాజకీయ నాయకులపై కామెంట్లు చేస్తోంది.. దీంతో ప్రభుత్వమే ఇద్దరు గన్ మెన్ లతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.. ఏదో ఒకరోజు కంగనకు పెద్ద థ్రెట్ ఉంది. అందుకే ఈ గన్ మెన్ల కాపలా. ఇంతకుముందు పలువురు నాయకులు కంగనను చంపేస్తామంటూ బెదిరించారు. అయినా తాటాకు చప్పుళ్లకు అదరక బెదరక కంగన తన పంథాను మాత్రం మార్చుకోలేదు. ఎప్పటిలానే నాయకులను చెడుగుడు ఆడుతోంది. మహారాష్ట్రలో ఘనాపాటీలుగా పేరున్న థాక్రేలనే ఎదురించింది కంగన. అందుకే తనకు ఈ ఇబ్బందులన్నీ.
అయితే ఈ సెక్యూరిటీతో తనకు తలనొప్పులేవీ లేవా? అంటే ఎందుకు లేవు. చాలా తలనొప్పులు ఉన్నాయని అంటోంది కంగన.. ఎక్కడ ఆగినా నడిచినా కదిలినా తుళ్లినా వీళ్లు వెంటపడుతుంటే తనకు చాలా హెడేక్ గా ఇబ్బందిగా ఉందిట. సినిమా సెట్స్ లో వీళ్లతో ఇబ్బంది. అందుకే ఆ ఇద్దరినీ తొలగించాలని కంగన ప్రభుత్వానికి మొరపెట్టుకుందిట. ఇప్పటికే రెండు మూడు లేఖలు రాసానని కూడా చెప్పింది. అయితే కంగనకు సెక్యూరిటీని తొలగించడానికి ప్రభుత్వమే (కేంద్రంలోని భాజపా-ఎన్డీఏ) కాస్త వెనక్కి జంకుతోంది.
నేను ఎవరినీ బెదిరించను:
క్వీన్ కంగన తనని ఎవరు బెదిరించినా కానీ తాను మాత్రం ఎవరినీ బెదిరించనని అంది. కంగన ఒక కొత్త పాయింట్ ని టచ్ చేస్తూ.. ఏమందంటే..? "నేను ఔట్ స్పోకెన్ పర్సనాలిటీని అని అనుకోను.. కానీ నేను ఎల్లపుడూ నిజాలు మాట్లాడుతాను.. ఎవరూ పాయింట్ ఔట్ చేయని వాటిని నేను బయటికి తీస్తాను. ఇది కొందరికి నచ్చదు. సమాజంలో బోలెడన్ని సమస్యలను ప్రస్థావిస్తాను. దీంతో ఈగో సెన్సిటివ్ పీపుల్ వెంటనే చంపేస్తామంటూ బెదిరిస్తుంటారు. నన్ను ఎవరు బెదిరించినా నేను ఎవరినీ బెదిరించలేదు..ఎవరికీ థ్రెట్ ని కాను. నేను సింపుల్ పర్సనాలిటీని.. అని కూడా చెప్పింది. అనునిత్యం మీపై కేసులు వేస్తుంటే తలనొప్పిగా లేదా? అని ప్రశ్నిస్తే... నాపై బోలెడన్ని కేసులు వేసారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులకు తిరగలేక చస్తున్నాను... అని కూడా అంది. ఇంతకుముందు సీనియర్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కూడా కేసు వేసాడని గుర్తు చేసుకుంది.