అమెరిక‌న్లు భార‌తీయుల కంటే అధ్వాన్నం: కంగ‌న‌

అమెరికా స్థానిక‌ యువ‌త‌లో జాత్యాహంకారం ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది.

Update: 2024-07-24 04:41 GMT

అమెరికా స్థానిక‌ యువ‌త‌లో జాత్యాహంకారం ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. సామాజిక మాధ్య‌మాల్లో వారి వికృత‌చ‌ర్య‌లు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. అది భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ న‌టి, ఎంపి కంగ‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. అమెరిక‌న్ల‌ను భార‌తీయుల కంటే అధ్వాన్నం అంటూ తిట్టేసింది కంగ‌న‌. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..


భార‌త మూలాలున్న‌ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను `హై-ఎండ్ కాల్ గర్ల్` అని గేలి చేస్తున్న‌ పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో కంగనా రనౌత్ త‌న చికాకును బ‌య‌ట‌పెట్టారు. క‌మ‌లా హారిస్ కు మద్దతు పలికారు. సె*స్ట్ పోస్ట్‌ను క్వీన్ నిందించింది. అమెరికన్లు భారతీయుల కంటే కూడా అధ్వాన్నంగా ఉన్నారని అగ్ర‌రాజ్యంలో ఇది తిరోగమనం అని అన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తన పేరును ప్రెసిడెంట్ రేసు నుండి ఉపసంహరించుకోగా.. అత‌డి స్థానంలో కమలా హారిస్‌ను అధ్య‌క్ష రేసు కోసం ఆమోదించాడు. అప్పటి నుండి ఆన్ లైన్‌లో మీమ్‌ల వర్షం కురుస్తోంది. త‌ప్పుడు కూత‌లు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఆ అభ్యంతరకరమైన పోస్ట్‌ను షేర్ చేసిన కంగన ప్రజాస్వామ్యవాదులకు మద్దతుదారు కానప్పటికీ, హారిస్ పై ఎంత ద్వేషం ఉందో తాను అర్థం చేసుకోలేక‌పోయానని కంగ‌న‌ పేర్కొంది.``బైడ‌న్ హారిస్‌ను ఆమోదించినందున... సోష‌ల్ మీడియా అటువంటి మీమ్‌లతో నిండి ఉంది... నేను డెమోక్రాట్‌లకు మద్దతు ఇవ్వను. కానీ అమెరికాలో కూడా కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఉన్న ఒక వృద్ధ మహిళా రాజకీయవేత్త ఇంత దారుణంగా సె*జాన్ని ఎదుర్కోవలసి రావడం చాలా నీచంగా ఉంది`` అని రాసారు. కంగ‌న మాట్లాడుతూ-``నిజాయితీగా చెప్పాలంటే ఈ అమెరికన్లు తాము చాలా ఆధునికులని అనుకుంటున్నారు. అందరూ నిజాయతీగా ఉండటానికి భారతీయుల కంటే చాలా తిరోగమనశీలంగా ఉన్నారు. సిగ్గుపడండి``అని తిట్టేసింది.

కంగనా 2024 లోక్‌సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుండి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ప్ర‌త్య‌ర్థిపై విజయం సాధించింది. క్వీన్ తరచుగా మండి ఎంపీగా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. అక్క‌డ‌ దేశంలోని సామాజిక మరియు రాజకీయ సమస్యల గురించి కూడా చాలా గొంతు వినిపించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంగనా న‌టించి నిర్మించిన `ఎమర్జెన్సీ` విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో న‌టిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎమ‌ర్జెన్సీ విడుద‌ల ముందు కంగ‌న ఫైరింగ్ గురించి నెటిజ‌నుల్లో డిస్క‌ష‌న్ మొద‌లైంది.

Tags:    

Similar News