కంగువ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన అదే..!

లేటెస్ట్ గా సినిమా షూటింగ్ పూర్తైందని చెప్పగా కనీసం ఇప్పటి నుంచైనా సరే సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ మొదలు పెడతారా అని సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Update: 2024-01-11 13:30 GMT

కోలీవుడ్ హీరో సూర్య డైరెక్టర్ శివ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న సినిమా కంగువ. పీరియాడికల్ కథతో భారీ సెట్టింగులతో వస్తున్న ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిన టీజర్ తప్పించి మరో అప్డేట్ బయటకు రాలేదు. సూర్య డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా భారీ రిలీజ్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా రిలీజ్ అయ్యే సినిమా ఏదైనా సరే సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ మీద బజ్ పెంచాల్సి ఉంటుంది. కానీ కంగువ టీం ఆ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్టు ఉన్నారు.

సూర్య ఫ్యాన్స్ కంగువ అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నా చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి న్యూస్ బయటకు రానివ్వట్లేదు. లేటెస్ట్ గా సినిమా షూటింగ్ పూర్తైందని చెప్పగా కనీసం ఇప్పటి నుంచైనా సరే సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ మొదలు పెడతారా అని సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో టాలీవుడ్ మేకర్స్ తీసుకునే జాగ్రత్తలు వేరే లెవెల్ లో ఉంటాయి.

ఈ విషయంలో కంగువ టీం చాలా వెనుకబడిందని చెప్పొచ్చు. సూర్య సరసన దిశా పటాని నటిస్తున్న కంగువ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీ.. డిఫరెంట్ సెటప్ తో వస్తున్న కంగువ మీద అంచనాలు పెంచేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ముందు సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే ఆటోమేటిక్ గా కావాల్సినంత బజ్ వస్తుందని సూర్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈమధ్య కమర్షియల్ సినిమాలకు దూరంగా సోషల్ మెసేజ్ సినిమాలు చేస్తూ వచ్చిన సూర్య కెరీర్ లో ఫస్ట్ టైం ఒక భారీ పీరియాడికల్ సినిమాతో వస్తున్నారు. కంగువ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అవుట్ పుట్ పై సూర్య చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి సూర్య మార్క్ సూపర్ హిట్ సినిమాగా కంగువ ఉంటుందా లేదా అన్నది చూడాలి. సూర్య సినిమాకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే కంగువ సినిమా రిలీజ్ విషయంలో తెలుగులో కూడా మంచి డేట్ రావాలని చూస్తున్నారు. ఇక్కడ సినిమాలేవి లేని టైం లో సోలోగా కంగువ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సూర్య కంగువ తో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి అది రీచ్ అవుతాడా లేదా అన్నది సినిమా వస్తేనేం చెప్పగలం.

Tags:    

Similar News