'కంగువ'తో క్లాష్.. మెగా హీరో హిట్టు కొడతాడా?

అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా 'కంగువ' నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2024-10-17 19:30 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోలోగా హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్' వంటి మూడు సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. వరుస పరాజయాలు అందుకున్న తర్వాత, ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి 'మట్కా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా 'కంగువ' నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైరా ఎంటర్టైన్మెంట్స్ & ఎస్ఆర్టీ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్స్ లో కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'మట్కా' మూవీ తెరకెక్కుతోంది. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. తెలుగు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. తమిళ హీరో సూర్య నటిస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ 'కంగువ' కూడా అదే రోజున రిలీజ్ కానుంది. వరుణ్ కెరీర్ కు మట్కా చాలా కీలకమైన సినిమా. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైంలో ఇలా సూర్య సినిమాకు పోటీగా పాన్ ఇండియా క్లాష్ కు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.

'మట్కా' చిత్రాన్ని వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో, 1958 - 1982 మధ్య కాలంలో యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్లుగా చిత్ర బృందం చెబుతోంది. ఇందులో వరుణ్ తేజ్ ఛాలెంజింగ్ రోల్ లో నాలుగు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నారు. మీనాక్షి చౌదరి, నోరా పతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు కలిగించింది. 'లేలే రాజా' పాటకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరోవైపు కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా 'కంగువ' రెడీ అవుతోంది. స్టార్ క్యాస్టింగ్ తో, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. టాలీవుడ్ లోనూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగూ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 'కంగువ' నుంచి 'మట్కా'కి గట్టి పోటీ ఎదురవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాకపోతే ఇక్కడ 'కంగువ' & 'మట్కా' సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. రెండూ వేర్వేరు జోనర్స్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాలు. ఈరోజుల్లో కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎన్ని సినిమాలనైనా ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుండి వరుణ్ తేజ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, పోటీలో ఎంత పెద్ద మూవీ ఉన్నా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. ఇది క్లిక్ అయితే మాత్రం మెగా హీరో బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ఛాన్స్ ఉంది. కనుక సినిమాని జనాలకు దగ్గర చెయ్యడానికి, కావాల్సినంత బజ్ క్రియేట్ చేయడానికి 'మట్కా' టీమ్ ఈ గ్యాప్ లో దూకుడుగా ప్రమోషన్స్ చెయ్యాల్సిన అవసరం ఉంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News