కన్నప్ప టీమ్.. అతన్ని పట్టిస్తే 5 లక్షలు

ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో “కన్నప్ప” కూడా టాప్ లిస్ట్ లో ఉంది.

Update: 2024-11-09 08:22 GMT

ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో “కన్నప్ప” కూడా టాప్ లిస్ట్ లో ఉంది. సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని మేకర్స్ మొన్నటివరకు కాస్త హడావుడిగా కనిపించింది. ఇక ఎప్పుడు ఊహించని విధంగా అనధికారికంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫోటోలు లీక్ కావడంతో కన్నప్ప టీమ్‌ అలెర్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్‌పై గడిచిన ఎనిమిదేళ్లుగా ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నట్లు టీమ్ ఎమోషనల్ విజ్ఞప్తి చేసింది.

ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు తమ టీమ్ రెండు సంవత్సరాలుగా అనవసర విరామాలు లేకుండా కృషి చేస్తుందని పేర్కొంది. లీక్ అయిన ఈ ఫోటో ప్రభావం కారణంగా తమ కష్టం మాత్రమే కాకుండా, 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలు కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉన్నట్లు వివరించింది. ఈ లీక్ ఎలా జరిగిందని కనుగొనేందుకు ప్రయత్నం చేస్తామని, నిందితులను పట్టుకునేందుకు పోలీస్ కేసు కూడా పెట్టనున్నట్లు టీమ్ ప్రకటించింది.

లీక్ అయిన ఫోటోను ఎవ్వరైనా షేర్ చేస్తున్నట్లయితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అభిమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి లీక్ ఫోటోలను షేర్ చేయకుండా, సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. ఇక ఈ లీక్ వెనుక ఉన్న వ్యక్తులను కనుగొంటే వారికి 5,00,000 రూపాయల బహుమానాన్ని కూడా ఇస్తామని కన్నప్ప టీమ్ వెల్లడించింది.

టీమ్ అధికారికంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలపాలని కోరింది. ఈ విషయం పట్ల ఎలాంటి సమాచారమున్నా వెంటనే ట్విట్టర్ ద్వారా సమాచారం అందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ సమగ్రతను కాపాడటంలో సహాయం చేయమని టీమ్ కోరింది. కన్నప్ప టీమ్ ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో ప్రేమ, పట్టుదలతో నిర్మిస్తున్నందున ఈ లీక్ జరిగిన విషయంపై నిరాశ వ్యక్తం చేసింది.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన సమగ్రతను కాపాడటంలో అభిమానుల మద్దతు అవసరం ఉందని తెలిపింది. ఈ సినిమా అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరించడానికి శ్రమిస్తున్న తమ టీమ్‌కు ఈ సమస్యలు ఎదురవడం తలదించుకునే విషయం అని అన్నారు. ఇక ప్రభాస్ అభిమానులకు కూడా ఈ విజ్ఞప్తి టచ్ చేసేలా ఉంది. అభిమానులు ఈ విజ్ఞప్తిని గౌరవించి, తగిన సహకారం అందిస్తారని టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఫ్యాన్స్ ఈ విషయంపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News