కన్నప్ప బిగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

ఆ సినిమా టీజర్ రిలీజ్ డేట్‍ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Update: 2024-05-13 13:58 GMT
కన్నప్ప బిగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
  • whatsapp icon

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై సినీ ప్రియుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తుండడంతో మంచి హైప్ నెలకొంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‍ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.


తాజాగా కన్నప్ప మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆ సినిమా టీజర్ రిలీజ్ డేట్‍ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీజర్ రిలీజ్ అవుతుందని మంచు విష్ణు వెల్లడించారు. కన్నప్ప ప్రపంచాన్ని దీంట్లో చూపిస్తామంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ సినిమా టీజర్ ఫ్రాన్స్ లో జరిగే ప్రతిష్టాత్మంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంఛ్ కానుంది.

"మే 20న కన్నప్ప ప్రపంచాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆగలేకపోతున్నా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍ వేదికపై టీజర్ లాంఛ్ కానుంది" అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఎముకలతో చేసిన ఆయుధాన్ని చేతిలో పట్టుకుని ఉన్న కొత్త పోస్టర్ ను కూడా ఆయన రివీల్ చేశారు. ఆ ఆయుధానికి రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. టీజర్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందోనని సినీ ప్రేక్షకులు అంతా మాట్లాడుకుంటున్నారు.

మహా శివుడి భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కన్నప్పగా మంచు విష్ణు కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు మహాభారతం టీవీ సిరీస్‍ ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‍ తో నిర్మిస్తున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు కూడా.

ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్‍, శివ రాజ్ కుమార్‌ తో పాటు ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, బ్రహ్మానందం, దేవరాజ్, ఐశ్వర్య, ముఖేష్ రుషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కొందరి షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమా 2024 లో రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News