ఆ సూపర్ స్టార్ చిత్రాన్ని 'పుష్ప' లా ఎక్కించేస్తున్నారా!
ఈ ఏడాది మాలీవుడ్ ఇండస్ట్రీ పేరు అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మాలీవుడ్ ఇండస్ట్రీ పేరు అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైవిథ్య మైన సినిమాలతో భారీ విజయాలు అందుకుంటున్నారు. `2018`.. `ది కేరళ స్టోరీ` లాంటి విజయాలు వంద కోట్లకు పైగా వసూళ్లు తేవడంతో! ఇండస్ట్రీ పేరు మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోలకే సాధ్యం కానిది కేవలం కంటెట్ తోనే సుసాధ్యం చేయడం వాళ్లకే చెల్లింది. అలాగే అక్కడి కంటెంట్ టాలీవుడ్ లోనూ రీమేక్ అవ్వడంతో ఇండస్ట్రీ రేంజ్ ని అంతకంకు విస్తరిస్తుంది.
భారత్ తరుపున `2018` ఆస్కార్ కి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఇన్ని శుభగడియల నడుమ మరో భారీ విజయం నమోదవుతున్నట్లే కనిపిస్తోంది. మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన `కన్నూర్ స్క్వాడ్` ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా `పుష్ప` లా పాయిజన్ లా జనాలకు ఎక్కేస్తుంది. రెండు రోజుల అనంతరం థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.
ఆరు రోజుల్లోనే సినిమా కేరళ నుంచే 20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. వరల్డ్ వైడ్ చూస్తే 42 కోట్లు దాటింది. తక్కువ థియేటర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా ఈ రేంజ్లో వసూళ్లు సాధించడంతో ఇప్పుడు స్థానికంగా థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు సమాచారం. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. ఇక సినిమా జానర్ విషయానికి వస్తే ఇదొక ఇన్వస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్. జార్జ్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మరో నలుగురు పోలీస్ ఆఫీసర్ల బృందం తో కాసర్గోడ్ అనే ఓ గ్రామంలో ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన దొంగతనం - మర్డర్ కేసు ఆధారంగా కథ నడుస్తుంది.
విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడటం...అవి ఎంతో థ్రిల్లింగ్ గా మలిచారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య ఆసక్తికర కథనంతో సాగుతుంది. తమ వృత్తి కారణంగా కుటుంబంపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందన్నది ఆసక్తికరంగా మలిచారు. స్టోరీ రొటీన్ ఫార్మెట్ లో అనిపించినా ఎక్కడా బోర్ కొట్టదు. ఈసినిమా రాబీ వర్గీస్ రాజ్కి తొలి సినిమా. ఇంతకు ముందు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. ఆ అనుభవంతో తాను రాసుకున్న కథకి నూరుశాతం న్యాయం చేసాడు.