కాంతార ప్రీక్వెల్.. రిలీక్ టార్గెట్ సెట్టయ్యింది
ఇక ప్రీక్వెల్ సినిమా షూటింగ్ దశలో ఉంది, నిర్మాత విజయ్ కిరగందూర్ తాజా అప్‌డేట్ ప్రకారం, 30% షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.
‘కాంతార’ బ్లాక్‌బస్టర్ విజయానికి కొనసాగింపుగా, ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ సినిమా పైన ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి, ముఖ్యంగా ‘కాంతార’ అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దర్శకుడిగా మరియు నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రీక్వెల్ సినిమా షూటింగ్ దశలో ఉంది, నిర్మాత విజయ్ కిరగందూర్ తాజా అప్‌డేట్ ప్రకారం, 30% షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.
ఈ ప్రీక్వెల్ కోసం చిత్ర యూనిట్ కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు, మరియు ఆయన పాత్ర గతంలో కంటే మరింత శక్తివంతంగా ఉండనుందని సమాచారం. నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా సినిమా నిర్మాణ పనులపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనే లక్ష్యంతో యూనిట్ ముందుకువెళ్తోంది.
రెండేళ్ల క్రితం 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కాంతార’ భారీ విజయం సాధించి, రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమకు మరోసారి గొప్ప గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’ పైన కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మొదట 125 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం బడ్జెట్ మరింత పెరిగి 150 కోట్లకు చేరుకుందని టాక్.
సినిమా కథ పరంగా, రిషబ్ శెట్టి దీనిని లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్‌గా మలిచారని సమాచారం. అంతేకాకుండా, కుండపురలో ఒక కీలక ఎపిసోడ్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేయగా, దానికి కోట్ల రూపాయలు ఖర్చయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘కాంతార: చాప్టర్ 1’ లోని ప్రధాన పాత్రల కోసం రిషబ్ శెట్టి స్టార్ యాక్టర్స్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
అందరికీ తెలిసినట్లుగా, ‘కాంతార’ కథ, నేపథ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఈ ప్రీక్వెల్ కూడా అదే విధంగా మంచి విజయం సాధించాలని మేకర్స్ భావిస్తున్నారు. ట్రేడ్ పండితులు ఈ ప్రీక్వెల్ 1000 కోట్ల మార్క్‌ను చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మరింత ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.