కాంతార ప్రీక్వెల్ హీరోయిన్ ఫిక్సైపోయే!
`కాంతార` ప్రీక్వెల్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా రిషబ్ శెట్టి ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు.
`కాంతార` ప్రీక్వెల్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా రిషబ్ శెట్టి ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు.హొంబలే ఫిల్మ్ భారీ బడ్జెట్ తోపాన్ ఇండియాలో నిర్మించడానికి ముందుకు రావడంతో? భారీ తనం ఏమాత్రం తగ్గకుండా రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్టోరీ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయ్యాయి. తాజాగా ఇందులో హీరోయిన్ కూడా ఫిక్సైంది. `సప్తసాగరాలు` చిత్రంలో నటించిన రుక్మిణి వసంత్ ని ఎంపిక చేసారు.
ఇటీవలే లుక్ టెస్ట్ లో కూడా పాల్గొందని సమాచారం. రిషబ్ శెట్టి రాసిన పాత్రకు అన్ని రకాలుగా రుక్మిణి సరితూగడంతో ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి సొంత రాష్ట్రానికి చెందిన నటికే రిషబ్ శెట్టి అవకాశం ఇచ్చినట్లు అయింది. సొంత ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో రిషబ్ శెట్టి ముందుటాడు. అతని సినిమాకి పనిచేసిన వారంతా తనకు కావాల్సినే వాళ్లే ఉంటారని ఓ సందర్భంలో అన్నాడు. అందుకు తగ్గట్టే అతడి ప్రణాళిక కనిపిస్తుంది.
ఇక `కాంతార`లో సప్తమీగౌడ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆమెది కూడా కర్ణాటకనే. వీరిద్దరు బ్యూటీ పరంగానూ ఒకర్ని ఒకరు పోలినట్లే ఉంటారు. ఇద్దరిలోనూ నేచురల్ బ్యూటీ హైలైట్ అవుతుంది. రుక్మిణి ఎంపిక వెనుక అది కూడా మరో రీజన్ కావొచ్చు. ఈ అమ్మడు ఇప్పటికే కన్నడలో కొన్ని సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో `అప్ స్టార్స్` అనే సినిమా కెరీర్ ఆరంభంలోనే నటించింది.
ప్రస్తుతం కన్నడలోనూ ముడు నాలుగు సినిమాలు చేస్తోంది. వాస్తవానికి `సప్తసాగరాలు` తర్వాత అమ్మడిని తెలుగులో లాంచ్ చేయాలని పలువురు దర్శక-నిర్మాతలు ప్లాన్ చేసారు. కానీ కుదర్లేదు. దీంతో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతోనే మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లాంచ్ అయితే రుక్మిణి తెలుగు అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.