అంబానీ పెళ్లి అతిథులు క‌ర్ధాషియ‌న్ సిస్ ఆటో రైడ్

వారి సందర్శన సమయంలో ఇద్దరూ ముంబై మాన్‌సూన్‌లో ఆటో రైడ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

Update: 2024-07-12 16:41 GMT

అంత‌ర్జాతీయ స్టార్లు కిమ్ కర్దాషియాన్- ఖోలే కర్దాషియాన్ ప్రస్తుతం అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం కోసం ముంబైలో ఉన్నారు. వారి సందర్శన సమయంలో ఇద్దరూ ముంబై మాన్‌సూన్‌లో ఆటో రైడ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ముంబైలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌ల కోసం ఇప్ప‌టికే అంతర్జాతీయ సెలబ్రిటీలు భారతదేశంలో అడుగుపెట్టారు. జూలై 11న ముంబైలో ల్యాండ్ అయిన రియాలిటీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియాన్ - ఖోలే కర్దాషియాన్‌ల రాకపై ఇంటర్నెట్ లో బోలెడంత సంద‌డి నెల‌కొంది. ముంబైలో ఉన్నందున కర్దాషియాన్ సోదరీమణులు సిటీలో రైడ్ కి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ముంబైలోని మాన్‌సూన్ వెద‌ర్ ని ఆస్వాధిస్తూ వారు ఆటో రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియోను ఖోలే విడుద‌ల చేసారు. ఈ వీడియోలో క‌ర్ధాషియ‌న్ సిస్ ఆటో రైడ్ ని చాలా ఉత్సాహంగా ఆస్వాధిస్తూ క‌నిపించారు. పెళ్లి మ‌ధ్య‌లో సిస్ట‌ర్స్ అలా న‌గ‌రంలో ఒక రౌండ్ చుట్టి వ‌చ్చారు. ముంబైలో వర్షాల మధ్య ఆటో రిక్షా రైడ్‌ను ఎంజాయ్ చేసారు.

తన కెమెరాలో ఈ వీడియోని బంధించేప్పుడు కిమ్ కెమెరాకు పోజులిచ్చింది. ''కిమ్ నేను, భారతదేశంలో రిక్షాలో షికార్ చేస్తున్నాం''అని ఖలే త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించింది. ''ఇది జామ్...ట్రాఫిక్ జామ్'' అని ఆమె వ్యాఖ్యానించినప్పుడు ఖోలే రోడ్డుపై రద్దీ గురించి అడిగి తెలుసుకుంది. ఆటో రైడ్ కోసం ఖోలే లేత గోధుమరంగు బాడీ-కాన్ డ్రెస్‌లో బ‌య‌ల్దేర‌గా.. కిమ్ వైట్ బాడీ-కాన్ డ్రెస్‌లో క‌నిపించింది. ఆసక్తికరంగా వారి నుదిటిపై బొట్టు బిళ్ల‌, కుంకుమ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. అవి విదేశీ సిస్ట‌ర్స్ కిమ్ - ఖోలేకి భార‌తీయ‌త‌ను అద్దాయ‌ని చెప్పాలి.

కొన్ని గంటల క్రితం ముంబై హోటల్‌లో కిమ్‌-ఖోలే సిస్ట‌ర్స్ కు సాదర స్వాగతం పలికిన వీడియోలు, ఫోటోలను కిమ్ స్వ‌యంగా షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. హోటల్ ప్రవేశద్వారం వద్ద ఆమెకు సాద‌ర స్వాగతం పలికిన ఫోటోని పోస్ట్ చేసింది. అక్కడ సిబ్బంది ఖోలే నుదిటిపై టికా (పవిత్రమైన గుర్తు)ను అద్ది.. మెడలో శాలువా వేసి, అందమైన పూల గుత్తితో స్వాగతం పలికారు. కిమ్ మర్యాదపూర్వకంగా వారికి 'ధన్యవాదాలు' తెలిపారు. దీనితో పాటుగా హోట‌ల్ లో అంద‌మైన డిజైన‌ర్ పెయింటింగ్స్ ఆక‌ర్షించాయి. ఇందులో గులాబీ దండతో అలంకరించిన‌ పాలరాతి ఏనుగుల‌ ఫోటోలు, ఒక ప్లేట్ నిండా గజ్రాలు (చిన్న పూల దండలు) ..పసుపు వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలు, పాలరాతి గోడపై పూల డిజైన్ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

కర్దాషియాన్ సోదరీమణులు ఇప్పటికే భారతీయ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప్రేమిస్తున్నారని, భారతీయ శైలి వివాహాల‌ను తిల‌కించాల‌ని ఉత్సాహంగా ఉన్నారని వారి ఉత్సాహాన్ని బ‌ట్టి అంచ‌నా వేయ‌గ‌లం. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల బిగ్ డే కోసం రెమా, మైక్ టైసన్, జాన్ సెనా వంటి అంతర్జాతీయ తారలు కూడా స్టార్రి వేడుకల్లో పాల్గొంటుండ‌డం ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News