అలా చేస్తేనే పనవుతుందంటోన్న హాట్ బ్యూటీ!
తాజాగా హిట్ బొమ్మ కావాలంటే ఇలాంటి మ్యాజిక్ లు తప్పని సరి అంటూ బెబో కరీనా కపూర్ తనకు తెలిసిన విషయాలు పంచుకుంది.
సినిమా ఎలా చేసినా అంతిమంగా విజయం అన్నది కీలకం. సక్సెస్ ఒక్కటే ఇండస్ట్రీలో నడిపించేది. కొత్త అవకా శాలు సృష్టించేది. అందుకోసం దర్శకులు ఎంతో శ్రమిస్తారు. ఎంతో కాలం వెచ్చించి కథలు రాస్తుంటారు. అదే కథపై రకరకాల ఎనాలసిస్ లు...ఒపీనియన్లు తీసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే దర్శకుడిని మించి హీరో నమ్మాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ట్రెండ్ మారిన నేపథ్యంలో హీరోలంతా దర్శకులు ఏం చెబితే అది చేస్తున్నారు.
దర్శకుల నిర్ణయానికి హీరోలు కట్టుబడి ఉంటున్నారు. తాజాగా హిట్ బొమ్మ కావాలంటే ఇలాంటి మ్యాజిక్ లు తప్పని సరి అంటూ బెబో కరీనా కపూర్ తనకు తెలిసిన విషయాలు పంచుకుంది. 'ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలంటే ఏకైక ఫార్ములా మాయాజాలాన్ని సృష్టించగల సామర్ధ్యం ఆ కథలో ఉండాలి. శక్తివంతమైన భావోద్వేగాలు , సీటు అంచున కూర్చోబెట్టే మలుపులు, మరుపురాని సంగీతం ఇలా సినిమా రెండున్నర గంటల్లో ఏదో ఒకటి ప్రేక్షకుడి మనసును తాకాలి.
ప్రతీ సన్నివేశం తెరపై మ్యాజిక్ సృష్టించేలా , మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండాలి. అప్పుడు కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి మ్యాజిక్ లు ప్రతీ కథలోనూ ఉండేలా చూసుకోవాలి అని చెప్పను. కొన్ని కథలకు మాత్రం ఇలాంటి వాటిని జొప్పించాలి. మరికొన్ని కథలు ఓ ప్లోలో సాగిపోతుంటాయి. అవన్నీ ఆరంభం నుంచే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. అలాంటి కథలకు మ్యాజిక్ అవసరం లేదు' అని అంది.
ఇటీవలే కరీనా కపూర్ 'సింగం ఎగైన్' తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్శియల్ గా బాగానే రాణించింది. అంతకుముందు 'క్రూ'తో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ కమిట్ అవ్వలేదు. కొత్త ఏడాది 2025లో కొత్త సినిమాల విషయాలు చెప్పే అవకాశం ఉంది.