కరీనా మైండ్ లో హాలీవుడ్ ఆలోచనే రానివ్వదా?
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మూడు దశాబ్ధాలగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. టెలివిజన్ పైనా మెరిసంది. డాక్యుమెంటరీల్లోనూ నటించింది. వెండి తెరపై తాను నటించని హీరో అంటూ లేరు. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.
లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. అయితే ఇంతవరకూ ఒక్క హాలీవుడ్ సినిమా కూడా చేయలేదు. కరీనా కంటే ముందు... ఆతర్వాత వచ్చిన వారు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసారు. దీపికా పదుకొణే...అలియాభట్ లాంటి యంగ్ బ్యూటీలు కూడా సినిమాలు చేసారు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా లాంటి వారు హాలీవుడ్ లో పనిచేసారు. కానీ కరీనా కపూర్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో ఓవర్సీస్ హాలీవుడ్ ఆలోచనలు ఏమీ లేవా? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. `నేను నటిగా ఎంతో సంతోషంగా ఉన్నాను. అన్ని రకాల పాత్రలతో సంతృప్తి చెందాను. ఫలానో భాషలో..ఫలానా పాత్ర చేయాలి అనే ఆత్రం నాలో లేదు. ఉన్న స్థానాన్ని పదిలంగా కొనసాగించగల్గితే అదే గొప్ప సంతోషాన్ని అందిస్తుంది. ఇప్పటివరకూ నేను అనుకున్నందంతా సాధించాను. ముఖ్యంగాహాలీవుడ్‌లోకి ప్రవేశించాలని? ఆంగ్ల భాషా చిత్రాలలో నటించాలనే కోరిక ఎప్పుడూ పుట్టలేదు.
నేను లక్ష్యంగా పెట్టుకున్న ప్రతీదాన్ని సాధించాను. హాలీవుడ్ పై మాత్రం అలాంటి ఆశలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా నన్ను అభిమానించే వారున్నారు. వాళ్లు నా సినిమాలు చూసి బాగా చేసారనే ఒక్క మాట నాకెంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. నా ఆశయాలు అర్థవంతమైన. నా పట్ల నేను నమ్మకంగా ఉంటాను. నేను ఎలా మొదలయ్యాను. నేడు ఎలా ఉన్నాను? అన్నది నాకు నిరంతరం మైండ్ లో అండర్ కరెంట్ గా రన్ అవుతుంటుంది.