ఫోటో స్టోరి: అల్ట్రా మోడ్రన్ దేవతా సుందరి
బెబో తాజా ఫోటోషూట్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'హౌస్ ఆఫ్ మసాబా'కు బెబో కరీనా ముఖ చిత్రంగా మారింది
ఈ అందాన్ని అలా చూస్తే ఎవరైనా స్టన్నయిపోవాల్సిందే. ఇద్దరు కిడ్స్ కి మమ్మీ అని చెప్పినా ఎవరూ నమ్మరు. మామ్ అయ్యాక అంతగా మేకోవర్ చూడగానే బెబో కరీనా కపూర్ కమిట్ మెంట్ ని పొగిడేయకుండా ఉండలేరు. బెబో ఈజ్ బ్యాక్. లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోషూట్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. జీరో సైజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన కరీనా కపూర్ ఖాన్ ఇప్పటికీ తన రూపంలో పెద్దగా మార్పు లేదని నిరూపిస్తోంది. దానికోసం బెబో జిమ్ లో కసరత్తులు, యోగా, మెడిటేషన్ విషయంలో ఎంతో కమిట్ మెంట్ ని కలిగి ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు.
బెబో తాజా ఫోటోషూట్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'హౌస్ ఆఫ్ మసాబా'కు బెబో కరీనా ముఖ చిత్రంగా మారింది. ఈ ఫోటోషూట్ లో కరీనా రకరకాల డిజైనర్ దుస్తుల్లో అందంగా కనిపించింది. ముఖ్యంగా బ్లాక్ మఖమల్ డిజైనర్ డ్రెస్ దానిపై క్రిస్టలైన్ గోల్డ్ డిజైన్స్ తో రూపొందించిన షేడెడ్ లుక్ తన అందాన్ని పదింతలు పెంచిందనడంలో సందేహం లేదు. బెబో టోన్డ్ బాడీ షేప్ ని ఈ డ్రెస్ మరింత ఎలివేట్ చేయడం ఇంట్రెస్టింగ్. ''కరీనా టైమ్‌లెస్.. నేను ఈ ప్రచారానికి కాలాతీత ముఖాన్ని కోరుకున్నాను. ఆమె తన జీవితంలో లేదా కెరీర్‌లోని ప్రతి దశలో అత్యంత ఆత్మ విశ్వాసంతో ఉంది'' అని మసాబా తన పోస్ట్ లో రాసారు. ఈ సంఘం బలం, స్వాతంత్య్రం వ్యక్తిత్వాన్ని మూర్తీభవించిన వధువులకు నివాళులర్పించే రూపమిది. ఈ ప్రచారం ఒక లేఖ..కరీనాకు ధన్యవాదాలు అని డిజైనర్ మసాబా గుప్తా తెలిపారు.
కొత్తదనాన్ని ట్రెండ్‌గా మార్చే వరకు జనం మెచ్చుకోరు. మసాబాతో మీ అనుబంధం చాలా కొత్తది.. విభిన్నమైనది. శుభాకాంక్షలు క్వీన్ అని ఒక అభిమాని ప్రశంసించగా, క్యా సుందర్ లడ్కీ అంటూ మరో అభిమాని ఫైర్ ఈమోజీని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
మర్డర్ మిస్టరీలో బెబో
స్కాం 1992 దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో వరల్డ్ ప్రీమియర్ కి కరీనా హాజరైంది. ఈ వేదికపై మేకర్స్ మొదటి అధికారిక పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ చిత్రంలో డిటెక్టివ్‌గా నటించిన కరీనా కపూర్, ఈ చిత్రానికి ప్రేరణగా నివేదించబడిన ఎమ్మీ అవార్డు గెలుచుకున్న HBO డ్రామా అయిన 'మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్' షేడ్స్‌లో కనిపిస్తుంది.
ఫస్ట్ పోస్టర్లో కరీనా ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. ద బకింగ్‌హామ్ మర్డర్‌కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ లుక్ పోస్టర్ నిజంగానే సినిమా చూడాలనే ఉత్సాహాన్ని పెంచింది. ఇద్దరు పోలీసులు నిర్భందిస్తుంటే వారి నుంచి విడిపించుకునేందుకు కరీనా కపూర్ ప్రయత్నిస్తోంది. ఈ పోస్టర్ ఎంతో క్యూరియాసిటీ పెంచింది. డిటెక్టివ్ గా తల్లిగా డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో కరీనా నటిస్తోంది.
ఈ పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ లో పాత బ్రిటిష్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ చిత్రం పూర్తిగా లండన్‌లో తెరకెక్కింది. 80శాతం ఆంగ్లంలో 20శాతం హిందీలో ఉంటుంది. మేర్ ఆఫ్ ఈస్ట్టౌన్లో టైటిల్ క్యారెక్టర్‌గా కేట్ విన్స్లెట్ నటించారు. ఇప్పుడు అదే పాత్రను కరీనా పోషిస్తోందనేది టాక్.
ది బకింగ్‌హామ్ మర్డర్స్‌లో హన్సల్ తనకు తల్లి పాత్రను, నో నాన్సెన్స్ డిటెక్టివ్ పాత్రను పోషించడానికి ముందు 'ఈస్ట్‌టౌన్..' చిత్రాన్ని ఆరుసార్లు చూశానని కేట్ విన్ స్లెట్ పనితీరును చూసి ఆశ్చర్యపోయానని కూడా కరీనా చెప్పింది. జానే జాన్‌తో తన ఇటీవలి డిజిటల్ అరంగేట్రం చేసిన కరీనా ఇప్పుడు ది బకింగ్‌హామ్ మర్డర్స్ కెరీర్లో ఒక కీలక మలుపు అని తెలిపింది. ఈ మూవీ కథాంశం ఆసక్తికరం. కరీనా, యాష్ టాండన్, రణవీర్ బ్రార్, కీత్ అలెన్ తదితరులు నటించిన 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' కి అసీమ్ అరోరా, కశ్యప్ కపూర్ ,రాఘవ్ రాజ్ కక్కర్ రచయితలు. దీనిని శోభా కపూర్, ఏక్తా కపూర్, కరీనా స్వయంగా బాలాజీ టెలిఫిల్మ్స్ TBM ఫిల్మ్స్ లో నిర్మించారు.