ట్రైబల్ బ్యూటీలా కరిష్మా వెలుగు జిలుగులు!
మల్టీకలర్ డిజైన్ లో అమ్మడు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కరీష్మా ఎంపిక చేసుకున్న యాక్సరసీన్ హైలైట్ అవుతున్నాయి.
కరిష్మా తన్నా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే ఐదారు సినిమాలు చేసింది. అమ్మడి కెరీర్ ఇప్పుడిప్పుడే మెరుగు పడుతుంది. కెరీర్ ప్రారంభించి ఏళ్లు గుడుస్తున్నా ఐడెంటిటీ కోసం చేయని ప్రయత్నం లేదు. చివరిగా అన్నింటిని తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఇక ఛాన్స్ దొరికనప్పుడల్లా ఇన్ స్టాని పైతం ఎప్పటికప్పుడు షేక్ చేస్తుంది. టెంప్టింగ్ ఫోటో షూట్లతో యువత హృదయాల్లో అగ్గి రాజేస్తుంది.
తాజాగా అమ్మడి న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గామారింది. ఇదిగో ఇక్కడిలా లెహంగా దుస్తుల్లో అందంగా ముస్తాబైంది. మల్టీకలర్ డిజైన్ లో అమ్మడు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కరీష్మా ఎంపిక చేసుకున్న యాక్సరసీన్ హైలైట్ అవుతున్నాయి. చెవులకు భారీ బుట్టలు ధరించి ముఖాన్ని మరింత అందంగా మార్చేసింది. బుట్టల డిజైన్ బాగుంది. చేతికి ఎంపిక చేసుకున్న మ్యాచింగ్ రింగ్ డిజైన్ ప్రతీది అమ్మడిన స్పెషల్ గా ఫోకస్ గా చేస్తున్నాయి. నేలపై కూర్చుని వివిధ భంగమలో కెమారాకి ఫోజులిచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
ఇక కరిష్మాతన్నా సినిమాల విషయానికి వస్తే 'ప్రెండ్స్ ఫర్ ఎవ్వెర్' చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయిం ది. ఆ తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకుంది. అటుపై కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఇలా రెండు పరిశ్రమల్లోనూ ఎంట్రీ ఇచ్చినా బ్యూటీని ఎంకరేజ్ చేసే వాళ్లే కరువయ్యారు. మరో రెండేళ్లు విశ్రాంతి తీసు కుని 'గ్రాండ్ మస్తీ' చిత్రంతో బాలీవుడ్ లో మళ్లీ కంబ్యాక్ అయింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ అవేవి ఐడెంటిటీని తీసుకురాలేదు.
ఈ సమయంలో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన 'సంజు' లో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో ఉత్తరాదిన బాగానే ఫేమస్ అయింది. ఆ వెంటనే అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం కెరీర్ పరంగా హ్యాపీ. అయితే నటిగా కన్నా కరిష్మా యాంకర్ గా..హోస్ట్ గా ఉత్తరాదిన ఫేమస్ అయింది. వెండి తెర అవకాశాలు కన్నా బుల్లి తెరపై నిత్యం బిజీగానే ఉంటుంది. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది.