1960 నేపథ్యం.. ఆ కథతో కార్తి..!

ఐతే లేటెస్ట్ గా కార్తి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. కథ నచ్చితే కొత్త దర్శకుడా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడైనా సరే కార్తి సినిమా చేస్తాడు.

Update: 2024-12-18 07:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ఈ మధ్యనే మేయలగన్ అదే సత్యం సుందరంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. విలేజ్ పాత్రలు చేశాడంటే చాలు కార్తికి కచ్చితంగా సూపర్ హిట్ పడినట్టే అనేట్టుగా అతని సినిమాలు ఉంటున్నాయి. మన పక్కింటి అబ్బాయిగా కార్తి చేసే సహజ నటన ఆడియన్స్ ని అలరిస్తుంది. సత్యం సుందరం తర్వాత ఖైదీ 2 నే చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఐతే లేటెస్ట్ గా కార్తి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. కథ నచ్చితే కొత్త దర్శకుడా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడైనా సరే కార్తి సినిమా చేస్తాడు.

ఈ క్రమంలోనే కార్తి చేస్తున్న 29వ సినిమా తమిజ్ డైరెక్షన్ లో వస్తుంది. 2022 లో తానక్కరన్ సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న తమిజ్ ఇప్పుడు కార్తితో తన సెకండ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా కార్తి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా 1960 రామేశ్వరం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఒక వైబ్ క్రియేట్ చేశారు మేకర్స్. కార్తి 29 ప్రీ లుక్ పోస్టర్ అదిరింది. సినిమా కోసం కార్తి కూడా మేకోవర్ చూపిస్తాడని టాక్. తెర మీద మనకు తెలియని కథలను చెప్పడం కోసం మేకర్స్ ఈ మధ్య సాహసాలు చేస్తున్నారు. విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసేందుకు కృషి చేస్తున్నారు. అందుకే కొన్ని నిజ జీవిత సంఘటనలకు వెండితెర దృశ్య రూపం కల్పిస్తున్నారు.

కార్తి 29 అనౌన్స్ మెంట్ తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. కార్తి చేయబోతున్న ఈ సినిమా గురించి కేవలం తమిళ ప్రేక్షకులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. తన ప్రతి సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం కార్తి చేస్తున్న ప్రయత్నానికి తగినట్టుగానే ఇక్కడ అతని సినిమాల ఫలితాలు వస్తున్నాయి. చివరగా వచ్చిన మేయలగన్ అదే సత్యం సుందరం సినిమా కూడా సక్సెస్ అయ్యింది. మరి కార్తి 29 ఎలా ఉంటుందో చూడాలి. కార్తి అండ్ టీం కూడా ఈ ప్రాజెక్ట్ పైన సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారని తెలుస్తుంది. కార్తి 29 సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News