యువ హీరో ఆ మిస్టేక్ చేస్తాడా..?
వరుస హిట్లు పడుతూ ఉంటే కెరీర్ ఎంత సాఫీగా వెళ్తుందో ఫ్లాపులు పడిన టైం లో అంత ఇబ్బందికరంగా ఉంటుంది
వరుస హిట్లు పడుతూ ఉంటే కెరీర్ ఎంత సాఫీగా వెళ్తుందో ఫ్లాపులు పడిన టైం లో అంత ఇబ్బందికరంగా ఉంటుంది. పరిశ్రమలో సక్సెస్ అనేది ఒక మహా మంత్రం గా పనిచేస్తుంది. హిట్లు పడితేనే ఇక్కడ ఎవరైనా నిలబడతారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే వరుస ఫ్లాపులు వస్తే వారి కెరీర్ గ్రాఫ్ చిన్నగా పడిపోతుంది. అందుకే కథల ఎంపిక సమయంలోనే సినిమా రిజల్ట్ ని కూడా గెస్ చేయగలిగిన వారే ఎక్కువ కాలం సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తారు.
యువ హీరోల్లో ఈ లాజిక్ పట్టిన కొందరు ఇప్పటికే కెరీర్ ని సరైన ట్రాక్ లోకి తీసుకెఓళ్తున్నారు. వారు చేసే సినిమాలు డిఫరెంట్ జానర్ లు ఉంటున్నా అవి ఆడియన్స్ ని మెప్పించేవిగా ఉంటున్నాయి. అయితే అలాంటి మరో స్ట్రాంగ్ హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు యువ హీరో కార్తికేయ. RX 100 కన్నా ముందు ఒక సినిమా చేసినా ఎవరు పట్టించుకోలేదు కానీ RX 100 తో అతన్ని హీరోగా గుర్తించారు.
RX100 హిట్ తో చేతినిండా ఆఫర్లు వచ్చాయి. ఛాన్సులు వచ్చాయి కదా అని కథ గురించి పెద్దగా ఆలోచించకుండానే చేస్తూ వెళ్లాడు కార్తికేయ. కానీ వరుస ఫ్లాపులు అతన్ని ఆలోచనలో పడేశాయి. ఫైనల్ గా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని లాస్ట్ ఇయర్ బెదురులంకతో హిట్ కొట్టి ఈ ఇయర్ మళ్లీ భజే వాయు వేగంతో మరో సక్సెస్ అందుకున్నాడు.
భజే వాయు వేగం కమిటైనప్పుడే తాను ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చిందని ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు కార్తికేయ. ఒకవిధంగా ఈ యువ హీరోకి చాలా త్వరగానే కెరీర్ మీద మంచి క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఫ్లాపులు పడితేనే అని కాకుండా కెరీర్ గురించి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. వరుస రెండు హిట్లు మళ్లీ అతన్ని మాయలో పడేసే ఛాన్స్ ఉంది కానీ కార్తికేయ మాత్రం కచ్చితంగా మంచి కథలే చేయాలన్న ఫోకస్ తో ఉన్నాడు. సో తనకు వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మిస్ యూస్ చేసుకోకుండా కెరీర్ స్ట్రాంగ్ చేసుకునేందుకు కష్టపడేందుకు సిద్ధమయ్యాడు కార్తికేయ. కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ లిస్ట్ లో ఈ యువ హీరో పేరు కూడా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.