సెలబ్రేషన్స్ లో కత్రినా-కౌశల్ ఎందుకో తెలుసా?
తమ రేంజ్ కి ఏ మాత్రం తగ్గుకుండా సెలబ్రేట్ చేసు కుంటున్నారు.
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ ప్రేమ వివాహం చేసుకుని ఎంత సంతోషంగా ఉంటున్నారో కనిపిస్తూనే ఉంది. రెండేళ్లగా క్యాట్ పుట్టిన రోజు వేడుకల్ని విక్కీ కౌశల్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పూర్తిగా ప్రయివేట్ స్పేస్ తీసుకుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. విదేశాల్లో నిర్వహించాలనుకుంటే విదేశాలకు...స్వదేశంలో అనుకుంటే ఇక్కడ! తమ రేంజ్ కి ఏ మాత్రం తగ్గుకుండా సెలబ్రేట్ చేసు కుంటున్నారు.
తాజాగా కత్రినా 41వ పుట్టిన రోజుకలు నేడు ఘనంగా జరిగాయి. భర్తతో కలిసి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దంపతులిద్దరు ఎంతో అందంగా , సంతోషంగా వేడుకలు చేసుకున్నారు. ఈసారి ఇద్దరి జీవితాల్లోకి మరొకరు కూడా రావడంతో మరింత ఆనందగా వేడుక చేసుకున్నారు. సెలబ్రేషన్స్ రోజు రాత్రి ఇ్దరు చీజీ పిజ్జా నైట్లో మునిగిపోయారు.
బీచ్ లో అందాల్ని ఆస్వాదించి మిడ్ నైట్ పిజ్జాలు..బర్గర్ లు తింటూ ఆ రాత్రిని ఆస్వాదించారు. హబ్బీ ఒడిలో క్యాట్ ఒదిగిన వైనం ఇద్దరి మధ్య బాండింగ్ ని రివీల్ చేస్తుంది. అలాగే బీచ్ లో ఎంతో సరదాగా సమాయన్ని గడిపారు. ఈ జోడీకి మండే ఎండ సైతం తెలియకుండా ఆస్వాదించారు. అలాగే ఓ పాత ఫోటోలో భాగంగా కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన కొత్తలో కొనుగోలు చేసి ప్లాట్ లో అడుగు పెట్టిన సందర్భాన్ని రివీల్ చేసారు.
క్యాట్ బర్త్ డేని ఉద్దేశించి విక్కీ కౌశల్ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. 'మీతో జ్ఞాపకాలు పంచుకోవడం జీవితంలో నాకు ఎంతో ఇష్టమైనదిగా భావిస్తాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియతమా' అంటూ ఓ లవ్ సింబల్ జోడించాడు. అలాగే ఇద్దరు కలిసిన కొన్ని కొత్త ఫోటోలు..మరికొన్ని పాత ఫోటోల్ని షేర్ చేసి పాత జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు.