మెరిసే అందంతో ఇస్మార్ట్ పాప హొయలు
మొదటిసారి ఘాటైన గ్లామర్ ను పూరి జగన్నాథ్ తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.
ప్రస్తుతం తెలుగు హీరోయిన్స్ లలో బాగా ట్రెండ్ అవుతున్న వారిలో కావ్య థాపర్ ఒకరు. ఈ బ్యూటీ రీసెంట్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ కావ్య థాపర్ గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాకి ముందు కావ్య థాపర్ చేసిన మూవీస్ ఏవీ కూడా గ్లామర్ టచ్ ఉన్నవి కాదు. మొదటిసారి ఘాటైన గ్లామర్ ను పూరి జగన్నాథ్ తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.
పాటలతో ప్రేక్షకులకి కావ్య థాపర్ గ్లామర్ ఫీస్ట్ ఇచ్చింది. దీంతో తెలుగులో మంచి కమర్షియల్ హీరోయిన్ అయ్యే టాలెంట్ ఈ బ్యూటీకి ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. గోపీచంద్ కి జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో కావ్య థాపర్ నటించిన ‘విశ్వం’ మూవీ త్వరలో థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ లలో కావ్య థాపర్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే కచ్చితంగా అమ్మడు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అందం, అభినయం ఉన్న కూడా కమర్షియల్ స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే కచ్చితంగా లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలని అంటారు. కావ్య థాపర్ కి అదొక్కటే తక్కువైంది. ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కావ్య థాపర్ సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’తో సక్సెస్ అందుకుంది.
ఈ ఏడాది రవితేజకి జోడీగా ‘ఈగల్’ మూవీలో కావ్య థాపర్ నటించింది. ఆ సినిమా సక్సెస్ కాలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ హోప్స్ అన్ని ‘విశ్వం’ పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కావ్య థాపర్ కి ఇన్ స్టాగ్రామ్ లో అదిరే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఇన్ స్టా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ తో పాటు గ్లామర్ ఫోటోషూట్ లు కూడా షేర్ చేస్తుంది.
రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ 2024లో కావ్య థాపర్ పాల్గొంది. ఇందులో అదిరిపోయే వెస్ట్రన్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ తో కావ్య థాపర్ చాలా గ్లామరస్ గా కనిపించింది. అల్ట్రా మోడ్రన్ లుక్ లో తన అందంతో అందరిని కట్టిపడేసింది. ఈ ఫోటోలను కావ్య థాపర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.