వేడుకగా నటి కీర్తి సురేష్ వివాహం
నటి కీర్తిసురేష్ వివాహం ఘనంగా జరిగింది. చివరి వరకూ పెళ్లి విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేసిన కీర్తి పది రోజులు ముందుగానే పెళ్లి విషయం చెప్పి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది.
నటి కీర్తిసురేష్ వివాహం ఘనంగా జరిగింది. చివరి వరకూ పెళ్లి విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేసిన కీర్తి పది రోజులు ముందుగానే పెళ్లి విషయం చెప్పి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. అప్పటి నుంచి కీర్తి సురేష్ ని పెళ్లి కూతురు దుస్తుల్లో ఎప్పుడు చూస్తామా? అన్న ఎగ్జైట్ మెంట్ అందరిలోనూ పెరిగిపోతుంది. తాజాగా ఆ పెళ్లి ఘట్టానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకుంది కీర్తి. నేడు గురువారం గోవా వేదికగా హిందూ సంప్రదాయంలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కీర్తి సురేష్ పసుపు, గ్రీన్ కలర్ కాంబినేషన్ చీర..రవిక ధరించింది. నుదిటిన బాసికం..పాపిడి బొట్టు..మెడలో పూల మాలలు....తలలో మల్లెపువ్వులు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది. కొత్త పెళ్లి కూతురు కళ్లద్దాలతో ఫోజులి వ్వడం ఇప్పుడు ట్రెండ్ గామారింది. ఆ రకమైన బ్లాక్ గ్లాసెస్ ని కీర్తి కళ్లకు ధరించింది. ఇక పెళ్లి కొడుకు కీర్తి మెడలో మూడు ముళ్లు వేస్తోన్న దృశ్యం చూడొచ్చు. ఆ సమయంలో కీర్తి భర్త వైపు చూస్తూ ఎంతో సంతోష పడుతుంది.
మూడు ముళ్లు వేసిన అనంతరం భర్త ఆంటోనీ తట్టల్ కీర్తి నుదిటిన ప్రేమతో ముద్దాడారు. పెళ్లి కూతురు..పెళ్లి కొడు కులను పక్క పక్కనే కూర్చోబెట్టి పంతులు పెళ్లి క్రతవుకు సంబంధించిన పూజలు చేయించడం చూడొచ్చు. ఇక వివాహం అనంతరం కొత్త జంట మధ్యలోకి కీర్తి అమితంగా ఇష్టపడే మూగ జీవి కుక్క పిల్లను చూడొచ్చు. దంపతు లిద్దరు ఆ కుక్క పిల్లను ముద్దాడుతు ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే కీర్తి- అంటోనీ క్రైస్తవమత ప్రకారం కూడా పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఆ పెళ్లి ఈరోజు సాయంత్రం ఓ చర్చి లో జరుగు తుందని తెలుస్తుంది.