కీర్తి సురేష్.. పెళ్లి టైమ్ లో హై గ్లామర్ డోస్!
ఈ ఫోటోలని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫోటోషూట్ లో ఎంబ్రాయిడరీ లెహంగాలో కీర్తి లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన ఆంటోనీ తటిల్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వీరి వివాహానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. గోవాలో కీర్తి, ఆంటోనీ పెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరగబోతోంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ నుంచి కీర్తి సురేష్ సన్నిహితులు కొంతమంది ఈ వివాహానికి హాజరు కాబోతున్నారు.
మరో వైపు డిసెంబర్ 20న హిందీలో కీర్తి సురేష్ డెబ్యూ మూవీ ‘బేబీ జాన్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్లామర్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా బేబీ జాన్ తో కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో బ్రేక్ వస్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ఆమె ఫేస్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేక ఫోటో షూట్ చేయించుకుంది.
ఈ ఫోటోలని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫోటోషూట్ లో ఎంబ్రాయిడరీ లెహంగాలో కీర్తి లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇటు లెహంగాలో ట్రెడిషనల్ స్టైల్ ని కవర్ చేస్తోనే మరో వైపు వెస్ట్రన్ టచ్ తో గ్లామర్ ఫీస్ట్ అందిస్తోందనే మాట ఈ ఫోటోలని చూస్తుంటే అనిపిస్తోంది. కీర్తి సురేష్ అభిమానులు కూడా ఈ మ్యాగజైన్ ఫోటోషూట్ ని లైక్ చేస్తున్నారు. ఈ లుక్స్ లో కీర్తి చాలా గ్లామరస్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
యూత్ ని క్లీన్ బౌల్డ్ చేసే లుక్స్ తో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేస్తోందని అంటున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరియర్ ఆరంభం నుంచి ఈ స్టాండర్డ్స్ లో కీర్తి సురేష్ గ్లామర్ రోల్స్ చేసి ఉంటే ఈ పాటికి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసే క్వీన్ అయ్యేదని ఆమె అభిమానులు అంటున్నారు. బేబీ జాన్ తర్వాత కీర్తి సురేష్ స్పీడ్ పెంచడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.