కళావతి టైటానిక్ హీరోయిన్ లా ఫేమస్!
కేట్ విన్ల్సెట్ అలా పెట్టి పుట్టింది కాబట్టే జేమ్స్ కామెరూన్ తో పనిచేసే అవకాశం వచ్చింది.
'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్స్లెట్ లా కనిపించాలని ఎవరికి ఉండదు. ఆమెలా ఫేమస్ అవ్వాలని కలలు కనది ఎవరు? కేట్ విన్ల్సెట్ టైటానిక్ లో నటించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. హీరోయిన్ అయిన ప్రతి నటి ఆమె లాంటి పాత్ర పోషించాలనుకుంటుంది. అలాంటి చిత్రాల్లో అవకాశాలు అందుకున్న వాళ్లు అదృష్టవంతులు. అలాంటి పాత్రలు దక్కాలంటే పెట్టి పుట్టి ఉండాలి. కేట్ విన్ల్సెట్ అలా పెట్టి పుట్టింది కాబట్టే జేమ్స్ కామెరూన్ తో పనిచేసే అవకాశం వచ్చింది.
అంత ఫేమస్ అయింది. తాజాగా అలాంటి అవకాశం నాకు వస్తే బాగుండని కీర్తి సురేష్ కూడా ఆశపడుతుంది. 'నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన సినిమా...ఎక్కువగా చూసిన సినిమా టైటానిక్. నా దృష్టిలో అదో అద్బుతమైన ప్రేమకావ్యం. అందులో హీరో-హీరోయిన్లు షిప్ అంచున నిల్చుని చేతులు చాచే సీన్ ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఆ సినిమాను చూసి కాస్త ఎమోషనల్ అయిన సందర్భాలున్నాయి. ఆమధ్య స్పెయిన్ కి వెళ్లినప్పుడు నాకు ఆ హీరోహీరోయిన్ లా ఓ కారు ముందు చేతుల చాచి నిల్చుని ఫోటో తీయించుకున్నా.
ఎప్పటికైనా అలాంటి అద్భుతమైన సినిమాలో నటించాలని నా కోరిక. మరి అలాంటి అవకాశం నా కెరీర్ ముగిసే లోపు వస్తుందో ? లేదో చూడాలి. వస్తే నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు. టైటానిక్ చూసిన ఏ నటికైనా అలాంటి డ్రీమ్ ఒకటి ఏర్పడుతుంది. అంత గొప్ప పాత్రలు పండించడం..అందులో అద్భుతమైన ఎమోషన్ జేమ్స్ కే చెల్లింది` అని తెలిపింది.
ఇక కీర్తి సురేష్ కెరీర్ సంతగి చూస్తే! కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో `బేబి జాన్` లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. `అక్క` అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో అమ్మడు ఏకంగా ప్రియమణితోనే పోటీ పడి నటిస్తోంది. ఆమె తో గ్లామర్ పరంగా పోటీ పడుతుంది. అందుకు అన్ని రకాలుగా సిద్దమై వెబ్ సిరీస్ కి కమిట్ అయింది.