ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్.. రానా ఇంట్రెస్టింగ్ అప్డేట్..

తాజాగా సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించి టైటిల్ ను రివీల్ చేశారు.

Update: 2024-10-10 10:33 GMT

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్.. టైటిల్ వింటేనే ఇంట్రెస్టింగ్ ఉంది కదా! ఇప్పుడు ఆ టైటిల్ తో మంచి ఎంటర్టైనింగ్ మూవీ రెడీ అవుతోంది. డియర్ మేఘా, భాగ్ సాలే వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు సినీ ప్రియులను అలరించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తోంది. హిలారియస్ ఫన్ రైడ్ గా నిర్మాత అర్జున్ దాస్యన్ రూపొందిస్తున్నారు. తన బ్యానర్ పై నాలుగో చిత్రంగా ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ లో హీరో హీరోయిన్లుగా రాహుల్ విజయ్, నేహా పాండే నటిస్తున్నారు. అశోక్ రెడ్డి కడడోరి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మేకర్స్ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించి టైటిల్ ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

రానా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ లో హీరో రాహుల్ విజయ్, హీరోయిన్ నేహా పాండే ఒక చిన్న ఇంట్లో దాక్కున్నట్టు కనిపించారు. డోర్ దగ్గర ఎవరి కోసమో చూస్తున్నట్లు నిలుచున్నారు. ఆ ఇంటి చుట్టూ గ్రామీణ నేపథ్యం కనిపిస్తుంది. పచ్చటి పొలాలు, కోళ్లు ఉన్నాయి. క్రేజీ టైటిల్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కచ్చితంగా థియేటర్లలో సినీ ప్రియులను మెప్పించనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఖేల్ ఖతం దర్వాజా బంద్‌ మూవీలో రాహుల్ విజయ్, నేహాతో పాటు గెటప్ శ్రీను, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గంగవ్వ, రచ్చ రవి, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు మేకర్స్ ప్రకటించనున్నారు. 2024లోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఖేల్ ఖతం దర్వాజా బంద్‌ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News