సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు అమ్మ ఏమందంటే
ఆల్రెడీ తన దగ్గరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ ఇంకా దేన్నీ ఫైనల్ చేసి సైన్ చేయలేదని అవంతిక చెప్పుకొచ్చింది.;

సౌత్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఖుష్బూ, తర్వాత సుందర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్ గా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న ఖుష్బూ కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా మారనున్నట్టు తెలిపింది. ఆల్రెడీ తన దగ్గరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ ఇంకా దేన్నీ ఫైనల్ చేసి సైన్ చేయలేదని అవంతిక చెప్పుకొచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో అవంతిక తన టీనేజ్ గురించి, సినిమాల్లోకి వస్తానన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన సలహాల గురించి మాట్లాడింది. యాక్టింగ్ లోకి రావాలనుకుని డిసైడై అమ్మకి చెప్పినప్పుడు తానెంతో మద్దుతిచ్చిందని, కానీ సినీ ఇండస్ట్రీలో ఉండటం, కొనసాగటం అనుకున్నంత ఈజీ కాదని చెప్పినట్టు తెలిపింది.
ఇండస్ట్రీ చాలా హార్ష్ గా ఉంటుందని, అందరూ నెపోటిజం గురించి మాట్లాడతారని, అలా అన్నప్పుడు వారి మాటలను తిరస్కరించలేనని తన తల్లి చెప్పినట్టు అవంతిక తెలిపింది. అయితే తన తల్లి చెప్పిన మాటల్ని విన్న తర్వాత అన్నింటికీ రెడీగా ఉండాలని డిసైడయ్యానని, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తానని, ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుందని, ఆఖరికి తన కష్టం, తాను చేసే పాత్రలే ఆడియన్స్ కు తనను చేరువ చేస్తాయని అవంతిక చెప్పుకొచ్చింది.
చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఎంతో అందమైన వారిని చూస్తూ పెరగడంతో తాను అసలు యాక్టింగ్ కు పనికిరానని, సినిమాల్లో నటించేంత టాలెంట్, అందం తన దగ్గర లేవనుకునేదాన్నని చెప్పింది. కానీ కరోనా టైమ్ లో తన కాలు విరిగి, దాన్నుంచి కోలుకుంటున్నప్పుడు నటి కావాలనుకున్నానని, యాక్టింగ్ ఎప్పుడూ నా మైండ్ లో ఉండేదేనని, కానీ దాన్నెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని అవంతిక చెప్తోంది.
ఇక ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న తన తల్లిదండ్రులు ఖుష్బూ, సుందర్ గురించి కూడా అవంతిక మాట్లాడింది. మా అమ్మ చేసిన ఎన్నో సినిమాలు నేను పుట్టకముందే వచ్చాయి. రమ్ బమ్ బమ్ మూవీ చూసి ఆమె చాలా గ్రేట్ అనుకున్నానని అవంతిక చెప్పింది. తండ్రి సుందర్ సినిమాలు తనకెంతో ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయని, ఆయన సినిమాలనెప్పుడూ తాను ఆడియన్స్ లాగానే చూస్తానంటోంది.
అయితే ఇన్నేళ్లుగా ఆమెకు తన తల్లిదండ్రులు ఇచ్చిన సలహాలు, సూచనలు అన్నీ తన కోసం, తన కెరీర్ మంచి కోసమే అని చెప్తోన్న అవంతిక, వారు ఏ విషయంలోనూ ఎప్పుడూ తనను ఒత్తిడికి గురి చేయలేదని, అలాంటి తల్లిదండ్రులు దొరకడం తన అదృష్టమని, వాళ్లు చెప్పిన బాటలో వెళ్తూ వాళ్లని అనుసరించడానికి ప్రయత్నిస్తా అని అవంతిక తెలిపింది.