ప్లాస్టిక్ సర్జరీ మ్యాటరే కాదు..!

ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఖుషి కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ గురించి స్పందించింది.

Update: 2025-01-28 07:02 GMT

హీరోయిన్స్‌ మాత్రమే కాకుండా ఎంతో మంది నటీనటులు అందం పెంచుకోవడం కోసం ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారు. కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం తెలిస్తే ఏమైంది అన్నట్లు ఉంటారు. హీరోయిన్స్‌లో పలువురు అందంగా ఉన్నా ఇంకా అందంగా కనిపించడం కోసం మొహంలో బాడీలో మార్పుల కోసం చిన్న చిన్న సర్జరీలు చేయించుకోవడం కామన్‌ విషయం. ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్స్‌గా నటిస్తున్న వారు చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్‌ ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనూ ఎన్టీఆర్‌కి జోడీగా దేవర సినిమాలో నటించి హిట్‌ కొట్టింది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీలోనూ జాన్వీ కపూర్‌ పలు సినిమాల్లో నటిస్తోంది. ఇక శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ సైతం ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 'లవ్‌యాపా' సినిమాతో ఖుషి కపూర్‌ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తమిళ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'లవ్ టుడే'కి రీమేక్‌గా రూపొందిన 'లవ్‌ యాపా' సినిమాలో ఖుషి కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఖుషి కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ గురించి స్పందించింది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ సర్జరీ అనేది పెద్ద మ్యాటరే కాదు. కొందరిని విమర్శించేందుకు ప్లాస్టిక్ సర్జరీని సాకుగా చూపిస్తున్నారు. జనాలు ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్‌ అనే దాన్ని మాత్రమే చూస్తున్నారని ఖుషి కపూర్‌ అసహనం వ్యక్తం చేసింది. చిన్నప్పటి నుంచి తాను ట్రోల్స్‌ చూశానని, వాటిని తాను ఎక్కువగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది.

ఖుషి కపూర్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు గతంలోనే పేర్కొంది. అందులో తప్పు ఏం ఉంది అన్నట్లుగా ఆ సమయంలో మాట్లాడింది. కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఇబ్బంది పడుతారు. కానీ తనకు అలాంటి ఇబ్బంది లేదని, తాను నిర్మొహమాటంగానే ఆ విషయాన్ని బయటకు చెప్పుకుంటాను అంది. తాజాగా ప్లాస్టిక్ సర్జరీ అనేది మ్యాటరే కాదని చాలా లైట్‌గా చెప్పేసింది. ఇండస్ట్రీలో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇంత ఓపెన్‌గా బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్‌ కేవలం ఖుషీ కపూర్‌ మాత్రమే అయ్యి ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అక్క జాన్వీ కపూర్‌ స్థాయిలో ఖుషి కపూర్‌ ఆఫర్లను సొంతం చేసుకోలేక పోతుంది. లవ్‌ యాపా సినిమాతో అయినా ఖుషీ కపూర్‌ బిజీ అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News