చాకు లాంటి కుర్రాడితో ఖుషీ ఖుషీగా

తాజాగా త‌న ప్రియుడు వేదాంగ్ రైనాతో ఖుషి క‌పూర్ ఎలాంటి సందిగ్ధ‌త‌లు, భేష‌జాలు పెట్టుకోకుండా జంట‌గా ర్యాంప్ వాక్ చేసి మురిపించింది.

Update: 2024-07-31 06:17 GMT

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి- బోనీక‌పూర్ జంట కుమార్తెలు జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ డేటింగ్ వ్య‌వ‌హారాలపై నిరంత‌రం మీడియాలో గాసిప్స్ షికార్ చేస్తున్నాయి. జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే పాపుల‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన శిఖ‌ర్ ప‌హారియాతో డేటింగ్ లో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మ‌యంలో జాన్వీ సోద‌రి, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషి క‌పూర్ కూడా డేటింగ్ లో ఉంద‌ని ముంబై మీడియా క‌థ‌నాలు అల్లుతోంది. ఖుషి ఇప్ప‌టికే వేదంగ్ రైనాతో డేటింగ్ లో ఉందనేది బాలీవుడ్ మీడియా ప్ర‌చారం.


తాజాగా స్నేహితుడు వేదాంగ్ రైనాతో ఖుషి క‌పూర్ ఎలాంటి సందిగ్ధ‌త‌లు, భేష‌జాలు లేకుండా జంట‌గా ర్యాంప్ వాక్ చేసి మురిపించింది. వేదాంగ్ కి ఖుషి స‌రైన జోడీ అనేంత‌గా ఆ ఇద్ద‌రి జంట అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ర్యాంప్ పై ఆ ఇద్ద‌రి న‌డుమా కెమిస్ట్రీ అలాంటి రొమాంటిక్ వైబ్స్ ని వెద‌జ‌ల్లింది. ఈ జంట‌కు ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ గౌరవ్ గుప్తా దుస్తుల‌ను డిజైన్ చేసారు. ఫ్యూచరైజ్డ్ ఎథ్నిక్ ఈస్థెటిక్ - రీఇమాజినింగ్‌ను అరుణోదయ లుక్ ని డిజైన్ చేయ‌డం ద్వారా గౌరంగ్ ఫ్యాష‌న్ సెన్స్ ఆస‌క్తిని క‌లిగించింది. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, FDCI ఇనిషియేటివ్ అయిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్‌తో కలిసి నిర్వ‌హించిన ఈవెంట్ లో ఖుషి- వేదాంగ్ రైనా షోస్టాపర్లుగా నిలిచారు. మెర్మైడ్-కట్ హెమ్‌లైన్ - స్టేట్‌మెంట్ సిల్వర్ ఎంబ్రాయిడరీతో స్వెల్ట్ ఐవరీ నంబర్‌ను ధరించి ర్యాంప్‌పై నడిచిన మొదటి న‌టిగా ఖుషీ రికార్డుల‌కెక్కింది. వేదాంగ్ పాక్షికంగా-సీక్విన్డ్ ఆల్-బ్లాక్ బంద్‌గాలా దుస్తుల‌ను ధ‌రించి స్టైలిష్ గా క‌నిపించారు. ఈ జంట ర్యాంప్ వాక్ స‌మ‌యంలో అద్భుత‌మైన కెమిస్ట్రీతో అల‌రించారు.

ఖుషీ- వేదాంగ్ కొంతకాలంగా ఒక‌రికొక‌రు స‌న్నిహితంగా ఉన్నారని ముంబై మీడియా చెబుతోంది. ది ఆర్చీస్ ప్రమోషన్‌ల సమయంలో ఈ జంట ప‌బ్లిక్ ప్రదర్శనలు ఆక‌ర్షించాయి. వారి రొమాంటిక్ డేట్ గురించి మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ ఈ జంట త‌మ డేటింగ్ ని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. ఇటీవ‌ల‌ అనంత్ అంబానీ -రాధిక మర్చంట్‌ వివాహ వేడుకల్లో జాన్వీ కోసం డిజైన‌ర్ లుక్ ని డిజైన్ చేసారు గౌరవ్ గుప్తా. ఇప్పుడు రిల‌య‌న్స్ షో యాధృచ్ఛికంగా ఖుషీని మొదటిసారి షోస్టాపర్‌గా గుర్తించింది. ఇది వేదాంగ్‌తో కార్యరూపం దాల్చింది. ఇటీవలి బాలీవుడ్ పోకడల ప్ర‌కారం.. అప్ప‌టికే డేటింగ్ చేస్తున్నార‌ని పుకార్లు వినిపిస్తున్న జంటలు ర్యాంప్ పై ఇలా అరంగేట్రం చేయడం... జంట‌గా రెడ్ కార్పెట్ ప్రదర్శన తర్వాత వారు కలిసి ఉన్నామ‌ని నిర్ధారించ‌డం.. చూస్తున్న‌దే. కానీ ఖుషి- వేదాంగ్ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ డేటింగ్ గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇది కేవ‌లం బాలీవుడ్ మీడియా ప్ర‌చారంగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది.

గత సంవత్సరం లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో మనీష్ మల్హోత్రా కోసం ఆదిత్య రాయ్ కపూర్ - అనన్య పాండే ర్యాంప్ పై అరంగేట్రం చేసారు. అప్ప‌టికి ఆ ఇద్ద‌రూ ఒకరితో ఒకరు తమ డేటింగ్ ని ఎప్పుడూ ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. ఆ త‌ర్వాత ఈ జంట న‌డుమ ఏం జ‌రిగిందో తెలిసిన‌దే. ఇప్పుడు వేదాంగ్ -ఖుషీ జంట‌ ICW ర్యాంప్ పై ఆరంగేట్రం చేయ‌డం వారి రిలేషన్ షిప్ స్టేటస్ ని ప్ర‌తిబింబిస్తుంద‌ని ముంబై మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

Tags:    

Similar News