క‌మాండో ఫైట‌ర్ గా కియారా!

అలాగే బాలీవుడ్ లో 'వార్ -2'లోనూ న‌టిస్తోంది. ఇందులో అమ్మడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జోడీగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో సొగ‌స‌రి క‌మాండో పైట‌ర్ పాత్ర పోషిస్తుంది.

Update: 2024-08-20 09:30 GMT

కియారా అద్వాణీ ఇంత‌వ‌ర‌కూ ల‌వ్ స్టోరీల్లోనూ..కామెడీ చిత్రాల్లోనే క‌నిపించింది. సాహ‌సోపేత‌మైన పాత్ర‌ల జోలికి వెళ్లింది లేదు. అలాంటి అవ‌కాశం అమ్మ‌డికి రాలేదు. కానీ ఇప్పుడిప్పుడు కెరీర్ లోకి కొత్త త‌ర‌హా పాత్ర‌లు ప్ర‌వేశిస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'గేమ్ ఛేంజ‌ర్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డి పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని...ప్ర‌భుత్వ అధికారి పాత్ర అని ఎంతో ఛాలెంజింగ్ రోల్ అని ప్ర‌చారం సాగుతుంది.

అలాగే బాలీవుడ్ లో 'వార్ -2'లోనూ న‌టిస్తోంది. ఇందులో అమ్మడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జోడీగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో సొగ‌స‌రి క‌మాండో పైట‌ర్ పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర చుట్టూ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలున్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దీనిలో భాగంగా కియారా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొంటుందిట‌.

ఇవి సినిమాలో హైలైట్ గా ఉంటాయ‌ట‌. ఇప్ప‌టికే కియారాపై మ‌రికొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారుట‌. కియారా ఎంట్రీ కూడా ఓఫైట్ తోనే ఉంటుందిట‌. క‌మాండో గెట‌ప్ లో అమ్మ‌డు ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక కియారా న‌టిస్తోన్న 'గేమ్ ఛేంజ‌ర్', 'వార్ -2'పై పాన్ ఇండియాలో భారీ అంచ‌నాలున్నాయి. స‌క్స‌స్ అయితే కియారా రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఒకేసారి పాన్ ఇండియాని షేక్ చేసిన బ్యూటీగా నీరాజ‌నాలు అందుకుంటుంది. ఇప్ప‌టికే అమ్మ‌డు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'విన‌య విధేయ రామ‌'లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

Tags:    

Similar News