ప్లాస్టిక్ స‌ర్జ‌రీ పుకార్ల‌తో క‌ల‌వ‌ర‌ప‌డ్డాను!

ప్ర‌జ‌లు ఏం చెబితే అదే నిజ‌మ‌ని తాను కూడా న‌మ్మే ప‌రిస్థితి వచ్చింద‌ని క‌ల‌త చెందారు.

Update: 2024-04-06 02:45 GMT

తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ పుకార్లు మానసికంగా కలవరపెట్టాయని కియారా అద్వానీ వాపోయారు. ప్ర‌జ‌లు ఏం చెబితే అదే నిజ‌మ‌ని తాను కూడా న‌మ్మే ప‌రిస్థితి వచ్చింద‌ని క‌ల‌త చెందారు. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే...

కియారా అద్వానీ వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ల‌క్కీ ఛామ్ గా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతోంది. ఇటీవ‌ల‌ ఈ బ్యూటీ `సత్యప్రేమ్ కి కథ`లో కనిపించింది. అంతకు ముందు `భూల్ భూలయ్యా 2`..`జగ్‌జగ్ జీయో` లాంటి విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించింది. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ కియారా నిరంత‌రం మీడియాకు ట‌చ్ లో ఉంది. ఓసారి ఒక ఈవెంట్‌కు హాజరైనప్పుడు తాను ఒక ప్ర‌త్యేక కార‌ణం వ‌ల్ల‌ ఎంతగా కలత చెందిందో మాట్లాడింది. ప్రజలు తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాన‌ని కామెంట్ చేసారు. ఇది ఒరిజిన‌ల్ రూపం కాదని చెప్పి ట్రోలింగ్ కి దిగార‌ని కియ‌రా తెలిపింది.

అర్బాజ్ ఖాన్ షో `పించ్`లో కియరా ఈ విష‌యాన్ని ప్ర‌స్థావించారు. తాను అందం కోసం ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నాన‌ని అంద‌రూ వ్యాఖ్యానించార‌ని తెలిపింది. అనితా అడజానియా షోలో కూడా ఇదే విష‌య‌మై కియ‌రా మాట్లాడింది. నేను ఒక పాప‌ల‌ర్ దుస్తుల బ్రాండ్ లాంచ్‌లో ఉన్నట్లు నాకు గుర్తుంది. నేను బాగా మేకప్‌ చేసుకున్నాన‌ని అనుకున్నాను. కానీ ఆ రోజు నేను ఓవర్‌బోర్డ్‌కి వెళ్లాను. ఫోటోలన్నింటిలో నా బుగ్గలపై రెండు బొమ్మలు కనిపించాయి. బహుశా అది నా చెంప ఎముకల వల్ల కావచ్చు లేదా అది హైలైటర్ వ‌ల్ల‌ కావచ్చు. కానీ అందరూ నాకు బొటాక్స్ అయిపోయిందని చెప్పడం మొదలుపెట్టారు. ఇది చాలా నీచమైనది. నా ముఖంలో ఏదో మార్పు వచ్చిందని చివ‌రికి నేను కూడా నమ్మల్సొచ్చింది`` అని అన్నారు. ఈ పుకార్లు తనను మానసికంగా ప్రభావితం చేశాయని కియారా చెప్పారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కియారా ప్ర‌స్తుతం రామ్ చరణ్‌తో కలిసి `గేమ్ ఛేంజర్`లో న‌టిస్తోంది. శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి `డాన్ 3`లోను కియ‌రా న‌టించ‌నుంది.



Tags:    

Similar News