బిగ్ బాస్ కి స్టార్ హీరో గుడ్ బై..!

ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ హిందీలో సూపర్ సక్సెస్ కాగా దాన్ని సౌత్ అన్ని భాషలకు తీసుకొచ్చారు.

Update: 2024-10-14 10:30 GMT

ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ హిందీలో సూపర్ సక్సెస్ కాగా దాన్ని సౌత్ అన్ని భాషలకు తీసుకొచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తుంది. ఐతే హిందీ తర్వాత ముందు కన్నడలోనే బిగ్ బాస్ షో మొదలైని. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో ఉంటే బిగ్ బాస్ కన్నడ మాత్రం 11వ షో జరుగుతుంది. అక్కడ సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు కిచ్చ సుదీప్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు.

కన్నడలో బిగ్ బాస్ సీజన్ 11 నడుస్తున్న ఈ టైం లో తను బిగ్ బాస్ హోస్టింగ్ కు గుడ్ బై చెబుతున్నా అంటూ కిచ్చ సుదీప్ ప్రకటించాడు. బిగ్ బాస్ హోస్ట్ గా తనను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన కిచ్చ సుదీప్ నెక్స్ట్ సీజన్ నుంచి తాను హోస్ట్ గా చేయట్లేదనే విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఈ 11 ఏళ్లు అటు సినిమాలతో పాటుగా బిగ్ బాస్ హోస్ట్ గా కూడా చేస్తూ వచ్చిన సుదీప్ 11 సీజన్ల తర్వాత బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పారు. ఐతే సుదీప్ వరుస సినిమాల కమిట్ మెంట్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. హోస్ట్ గా ఆయనకు బోర్ కొట్టేసింది కాబట్టే సుధీప్ బిగ్ బాస్ ని వీడుతున్నాడని కొందరు అంటున్నారు.

ఈమధ్యనే బిగ్ బాస్ తమిళ్ లో హోస్ట్ మారాడు. సీజన్ 7 వరకు కమల్ హాసన్ హోస్ట్ గా చేయగా ఇప్పుడు ఆ ఛాన్స్ ని విజయ్ సేతుపతి అందుకున్నాడు. ఐతే బిగ్ బాస్ కన్నడ 11వ సీజన్ పూర్తి చేసి 12వ సీజన్ నుంచి షోకి బై బై చెప్పేస్తున్నారు కిచ్చ సుదీప్. ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల బిగ్ బాస్ కన్నడ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నా కొత్త హోస్ట్ గా ఎవరు వస్తారా అన్న ఎగ్జైట్మెంట్ మొదలైంది.

బిగ్ బాస్ తెలుగు లో అయితే సీజన్ 1 ఎన్టీఆర్, సీజన్ 2 నాని చేయగా సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు హోస్ట్ మాత్రం ఇప్పుడప్పుడే మార్చే ఛాన్స్ లేదని అనిపిస్తుంది.

Tags:    

Similar News