అంబానీ పెళ్లిలో సితార సెల్ఫీ వైబ్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని క్యూట్ లుక్స్ కి అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-15 03:44 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని క్యూట్ లుక్స్ కి అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సితార‌ అంత‌ర్జాతీయ స్టార్ తో దిగిన సెల్ఫీలు వెబ్‌లో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే...

అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహ వేడుకలో అంత‌ర్జాతీయ రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌ను మహేష్ బాబు కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని కలిశారు. కిమ్‌తో సితార‌ సెల్ఫీలు దిగింది. అందుకు సంబంధించిన కొన్ని అంద‌మైన ఫోటోల‌ను సితార సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. సితార‌- కిమ్ ఈ ఫోటోల్లో చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ముఖ్యంగా సీతాపాప క్యూట్ లుక్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. కిమ్ త‌న‌దైన శైలి బుంగ‌మూతితో పెక్ ని విసురుతుంటే సితార కూడా త‌న‌తో పాటే అలాంటి ఒక అంద‌మైన ఎక్స్ ప్రెష‌న్ ఇవ్వ‌డం అంద‌రి దృష్టిని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది.

కిమ్ క‌ర్ధాషియ‌న్ -అనంత్-రాధిక వెడ్డింగ్ - అనే క్యాప్షన్‌తో సితార ఫోటోలను షేర్ చేసింది. కామెంట్స్ విభాగంలో అభిమానులు విస్తుపోయారు. ``బ్రో అక్కడ ఉన్న సెలబ్రిటీలందరిలోంచి సితార‌ కిమ్ కర్దాషియాన్‌ని ఎంచుకుంది..`` అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా.. స‌ర్టిఫైడ్ Gen Z గర్ల్ అని మ‌రొక‌రు కామెంట్ చేసారు. మేం జిటిఎ 6 కంటే ముందు కిమ్ మరియు సితారను ఒక ఫ్రేమ్‌లో పొందాము! అని మరొకరు వ్యాఖ్యానించారు. పిచ్చి క్రాస్ఓవర్! అని మూడవ అభిమాని అన్నాడు.

సితార తన తల్లిదండ్రులు మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ తో క‌లిసి అంబానీ పెళ్లికి విచ్చేసింది. రెడ్ కార్పెట్‌పై కుటుంబంతో కలిసి పోజులివ్వడంతోపాటు బారాత్‌లో షారుఖ్‌తో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

కాగా కిమ్ కర్ధాషియ‌న్ శుక్రవారం ముంబైలో అడుగుపెట్టారు. ఆమె సోదరి ఖోలే కర్దాషియాన్ కూడా త‌న‌తోపాటే విందుకు వ‌చ్చారు. కర్దాషియాన్ సోదరీమణులు వివాహానికి శుభ్ ఆశీర్వాద్ వేడుకలకు హాజరయ్యారు. వివాహ వేడుకల కోసం వారు సాంప్రదాయ భారతీయ దుస్తులలో క‌నిపించారు. కిమ్ ఎరుపు- తెలుపు దుస్తులలో కనిపించగా, ఖోలే గులాబీ, లేత గోధుమరంగు షేడ్స్ ధరించి కనిపించారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు శుభ వివాహ లేదా వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రెస్ కోడ్ భారతీయ సంప్రదాయం నేప‌థ్యంతో రూపొందిన‌ది. జూలై 13న అంబానీ కుటుంబం ‘శుభ్ ఆశీర్వాద్’ని నిర్వహించింది. జూలై 14 మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ నిర్వ‌హించ‌నున్నారు. డ్రెస్ కోడ్ ఇండియన్ చిక్. ఓవ‌రాల్ గా పెళ్లిలో అంబానీలు హెక్టిక్ గా ఉన్నారు.

Tags:    

Similar News