మొన్న బన్నీ.. ఇప్పుడు AA ఆర్మీ.. కిర్రాక్ RP సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఇటీవల లోకసభ ఎన్నికల పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగ్గా.. ఏపీ సమరం మాత్రం రసవత్తరంగా సాగింది
దేశంలో ఇటీవల లోకసభ ఎన్నికల పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగ్గా.. ఏపీ సమరం మాత్రం రసవత్తరంగా సాగింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి విజయం సాధించింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎన్నడూ లేనంతగా సినీ గ్లామర్ కనిపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అనేక మంది సినీ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ మెంబర్స్, జబర్దస్త్ ఆర్టిస్టులు రంగంలో దిగారు.
జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకుని.. ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ బిజినెస్ చేస్తున్న కిర్రాక్ ఆర్పీ కూడా జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల హీరో అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీ హోటల్ పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ పై కిర్రాక్ ఆర్పీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ ఓడిపోయారని, బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్ చేయడం తనకు నచ్చలేదని కిర్రాక్ ఆర్పీ అన్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్.. పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. ఇప్పుడు వారిపై కూడా ఆర్పీ మండిపడ్డారు. ముందుగా బన్నీ అభిమానులు.. AA ఆర్మీ అని చెప్పుకోవడం ఆపాలని ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. తన ఫ్యామిలీలోని మహిళలపై ట్రోల్స్ చేయడం ఆపకపోతే బాగోదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
"చెప్పాలంటే జనసైనికులు ఒక ఆర్మీ.. చంద్రబాబు క్యాడర్ ఒక ఆర్మీ.. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఆర్మీనే కాదు. మహిళలను అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడంలో వారు దిట్ట. మొన్నటి వరకు వైసీపీ ఆర్మీ ఎలా చేసిందో ఇప్పుడు AA ఆర్మీ అలానే చేస్తోంది. నా మాటలు నచ్చకపోతే నాకు అనాలి. కానీ నా ఫ్యామిలీలోని మహిళలపై ట్రోల్స్ చేస్తున్నారు. నా భార్య ఇన్ స్టా పోస్టులకు తప్పుగా కామెంట్లు పెడుతున్నారు. ఇది చాలా తప్పు" అని అన్నారు.
"అల్లు అర్జున్ గారు మీరు చేసింది కూడా తప్పు. మీరు పాన్ ఇండియా స్టార్ కావొచ్చు. మంచి యాక్టర్ కావొచ్చు. కానీ ఆరోజు శిల్పా రవి దగ్గరకు వెళ్లి తప్పు చేశారు. ఇప్పుడు ట్రోల్స్ చూసి కూడా ఎందుకు ఊరుకుంటున్నారు. మీ ఆర్మీ సామాజికంగా ఎలాంటి కార్యక్రమాలు చేయదు. శిల్పా రవిని ఎందుకు గెలుపించుకోలేకపోయారు? పుష్ప టికెట్ల ధరల విషయంలో వివాదం టైమ్ లో మీ ఆర్మీ ఎక్కడికి వెళ్లింది?" అని ఆర్పీ అడిగారు. మొత్తానికి ఆర్పీ ఇంటర్వ్యూలు.. ఏపీలో ఎన్నికల వేడిని ఇంకా చల్లారేలా చేయడం లేదు.