కుమ్మేసిన కిరణ్ అబ్బవరం

ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 6.18 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Update: 2024-11-01 07:35 GMT

ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అదే సమయంలో భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి యంగ్ హీరోల్లో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకరు. టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్న అతడు.. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు.

 

సరైన బ్లాక్ బస్టర్ కోసం చాలా కాలంగా వేచి చూస్తోన్న కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన సినిమానే ‘క’. సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో భారీ బడ్జెట్‌తో రూపొందింది. దీంతో ఇది మొదట్లోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ఫలితంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన ‘క’ సినిమాకు ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. అదే సమయంలో ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఫలితంగా దీనికి అద్భుతమైన స్పందన కూడా లభించింది. దీంతో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక ఫుట్‌ఫాల్స్‌తో పాటు టికెట్లు కూడా భారీగా అమ్ముడైన చిత్రంగా ఇది నిలిచింది.

ఆద్యంతం ఉత్కంఠను రేపే కథతో రూపొందిన ‘క’ సినిమాకు మొదటి రోజు భారీ రెస్పాన్స్ లభించడంతో కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 6.18 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది. తద్వారా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుంది.

దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినా అదిరిపోయే కంటెంట్‌తో వచ్చిన ‘క’ చిత్రానికి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. అలాగే, క్లీన్ హిట్ స్టేటస్‌ను సైతం వేగంగానే చేరుకోవడంతో పాటు కిరణ్ అబ్బవరంకు మంచి కంబ్యాక్ మూవీగా ఇది నిలవబోతుంది.

ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. సామ్ సీఎస్ దీనికి సంగీతం అందించారు. అలాగే, ఈ సినిమాలో అచ్యుత్ కుమార్, అన్నపూర్ణ, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags:    

Similar News