భర్తతో విడాకులు గురించి మాజీ ఏమన్నారంటే!
అమీర్ ఖాన్-కిరణ్ రావ్ విడాకులతో వేరైన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో వేరయ్యారు.
అమీర్ ఖాన్-కిరణ్ రావ్ విడాకులతో వేరైన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో వేరయ్యారు. అయితే భార్యాభర్తలుగా వేరైనా స్నేహితులుగా మాత్రం కలుస్తున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ తల్లి పుట్టిన రోజు వేడుకల్ని కూడా కిరణ్ రావ్ దగ్గరుండి జరిపించారు. ఆమోతో పాటు అమీర్ ఖాన్ మొదటి భార్య కూడా ఈవేడుకల్లో పాల్గొన్నారు. విడిపోయినా కలిసి ఉండే ఆరోగ్య కరమైన వాతావరణం బాలీవుడ్ లో ఎప్పటి నుంచో కనిపిస్తూనే ఉంది.
తాజాగా విడాకుల గురించి తొలిసారి కిరణ్ రావ్ స్పందించారు. సంబంధాలు ఎప్పుడూ పునర్నిర్వ చించబడాలని నేను భావిస్తాను. ఎందుకంటే పెరిగే కొద్ది మనుషులుగా మారుతాం. 16 ఏళ్ల బంధాన్ని దూరం చేసుకోవాలనుకున్నప్పుడు ఎమోషనల్ గా, మానసికంగా తట్టుకోవడం కష్టమైన పనే. కానీ తప్పదు. అది భరించాను. విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను. అమీర్ నా జీవితంలోకి రాక ముందు చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నాను.
నా స్వంతంత్రతను ఎంజాయ్ చేసా. కానీ ఒంటరి జీవితం కూడా ఫీలయ్యాను. కానీ ఇప్పుడలా కాదు . నాకు నా కొడుకు ఆజాద్ ఉండటంతో ఒంటరి తనం లేదు. రెండు కుటుంబాల నుంచి నా కు మంచి సహకారం ఉంది. అమీర్ తో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉంది` అని అన్నారు. అమీర్-కిరణ్ రావ్ లు 2005లో వివాహం చేసుకున్నారు. `లగాన్` సినిమాకి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న సమయంలోనే అమీర్ ఆమెతో ప్రేమలో పడి వివాహంతో ఒకటయ్యారు.
ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నారు. కిరణ్ రావు దర్శక-నిర్మాతగా కొనసాగుతోన్న సంగత తెలిసిందే. ఇటీవలే ఆమె దర్శకత్వం వహించిన `లాపతా లేడీస్` రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పదేళ్ల విరామం అనంతరం `దోభీఘాట్` తర్వాత కిరణ్ రావు దర్శకత్వం వహించిన సినిమా ఇది.