కిషోర్ తిరుమ‌ల మ‌ళ్లీ క‌నిపించ‌లేదే!

కిషోర్ తిరుమ‌ల చివ‌రి రెండు చిత్రాలు 'రెడ్' ,' ఆడ‌వాళ్లు మీకు జోహార్లు' అను కున్నంత‌గా అంచ‌నాలు అందుకోలేదు.

Update: 2024-12-26 09:30 GMT

కిషోర్ తిరుమ‌ల నుంచి సినిమా రిలీజ్ అయిన రెండున్న‌రేళ్లు దాటింది. చివ‌రిగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్ అయింది. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఆ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. అప్ప‌టికే డైరెక్ట‌ర్ గా కిషోర్ కి మంచి పేరుంది. 'నేను శైల‌జ‌', 'ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ', 'చిత్ర‌ల‌హరి' లాంటి యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీలతో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. డీసెంట్ క్లాసిక్ చిత్రాలు దూర‌మైన నేప‌థ్యంలో మ‌ళ్లీ కిషోర్ రూపంలో అవి వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు అయింది.

రామ్ హీరోగా తెర‌కెక్కించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ 'రెడ్' కూడా రొటీన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ల‌కు భిన్నంగానే ఉంటుంది. కానీ ఆ సినిమా క‌నెక్ట్ అవ్వ‌లేదు. ఇలా ల‌వ్ స్టోరీల్లోనూ...క్రైమ్ క‌థ‌ల్లోనూ త‌న‌దైన మార్క్ వేసాడు కిషోర్. మొత్తంగా కిషోర్ సినిమాల‌న్నీ యావ‌రేజ్ గా ఆడాయి. అట్ల‌ర్ ప్లాప్ సినిమాలైతే ఆయ‌న నుంచి ఇంత‌వ‌ర‌కూ రాలేదు. స్టోరీ...స్క్రీన్ ప్లే రైట‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేకత క‌లిగి ఉన్నాడు. అయితే ఈ న‌యా డైరెక్ట‌ర్ సినిమా చేసి చాలా కాల‌మ‌వుతోంది. రెండున్న రేళ్ల‌గా ఆయ‌న నుంచి ఎలాంటి సినిమా అప్ డేట్ రాలేదు.

మ‌రి అవ‌కాశాలు రాలేదా? వ‌చ్చినా తాను అనుకున్న హీరోలు క‌నెక్ట్ అవ్వ‌డం లేదా? ఫాంలో ఉన్న హీరోలు డేట్లు ఇవ్వ‌డం లేదా? ఇలా ఎన్నో సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. స‌క్సెస్ ల్లో ఉన్న హీరోలంతా బిజీగా ఉన్నారు. కొత్త సినిమాల‌కు డేట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఫాంలో ఏ డైరెక్ట‌ర్ ఉన్నాడో చూసుకుని వాళ్ల క‌థ‌ల‌కే సైన్ చేస్తున్నారు. ప్లాప్ డైర‌క్ట‌ర్ల‌తో రిస్క్ తీసుకోవ‌డం లేదు. కిషోర్ తిరుమ‌ల చివ‌రి రెండు చిత్రాలు 'రెడ్' ,' ఆడ‌వాళ్లు మీకు జోహార్లు' అను కున్నంత‌గా అంచ‌నాలు అందుకోలేదు. ఈ ప్ర‌భావం కిషోర్ అవ‌కాశాల‌పై కొంత వ‌ర‌కూ ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది.

మ‌రి కొత్త ఏడాదిలోనైనా గుడ్ న్యూస్ చెబుతాడేమో చూడాలి. ఫాంలో ఉన్న హీరోల్ని ప‌క్క‌న‌బెట్టి త‌న‌దైన స్టోరీతో కొత్త వాళ్ల‌తో సినిమా చేసే దిశ‌గా ఏమైనా అడుగులు వేస్తాడా? లేక హీరో దొరికే వ‌ర‌కూ వెయిట్ చేస్తాడా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే అత‌డి వ‌ద్ద కొన్ని స్టోరీలు సిద్దంగా ఉన్నాయి. వాటికి క‌నెక్ట్ అయ్యే హీరో ఎవ‌రు సెట్ అవుతారా అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News