నాపై ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ మాయని మచ్చ!
తాజాగా ఆనాటి సంగతుల్ని రాహుల్ ఓ పాడ్ కాస్ట్ లో గుర్తు చేసుకున్నాడు.
కరణ్ జోహార్ టాక్ షో `కాఫీ విత్ కరణ్` లో ఆర్దిక్ పాండ్య- కె.ఎల్ రాహుల్ నాలుగేళ్ల క్రితం మహిళల్ని ఉద్దేశించి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు అప్పట్లో ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ఇద్దరిపై 20 లక్షల జరిమానా తో పాటు, సస్పెన్షన్ వేటు సైతం పడింది. ఇద్దరిపై నెట్టింట ట్రోలింగ్ ..విమర్శలు వెల్లు వెత్తాయి. తాజాగా ఆనాటి సంగతుల్ని రాహుల్ ఓ పాడ్ కాస్ట్ లో గుర్తు చేసుకున్నాడు.
`సాధారణంగా ట్రోలింగ్ పట్టించుకోను. కానీ కొన్నేళ్ల క్రితం నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కూర్చున్నా..నుంచున్నా ట్రోల్స్ చేసారు. ఆ ఇంటర్వ్యూ వ్యక్తిగతంగా నా జీవితాన్ని మార్చేసింది. సాధారణంగా నేను మృదు స్వభావం కలిగిన వ్యక్తిని. టీమ్ ఇండియాకు ఆడటం మొదలు పెట్టిన తర్వాతే ఆత్మ విశ్వాసం పెరిగింది. 100 మంది మధ్యలో ఉన్నా మాట్లాడగలిగేవాడిని. కానీ ఇప్పుడలా చేయలేక పోతున్నా.
ఆ ఇంటర్వ్యూ బాగా భయపెట్టింది. స్కూల్లో నన్నెప్పుడూ సస్పెండ్ చేయలేదు. శిక్షించలేదు. ఆ వ్యాఖ్యల తర్వాత జట్టులో స్థానం కోల్పోయా. తొలిసారి అలాంటి అనుభవం ఎదురవ్వడంతో దాన్ని ఎలా ఎదుర్కోవా లో తెలియలేదు. ఇప్పటికీ అది మాయని మచ్చలా మిగిలిపోయింది` అని అన్నాడు. ఆ వ్యాఖ్యలకు గానూ చట్టపరంగా ఇబ్బందుల్లో పడ్డారు. బీసీసీ క్షమాపణలు చెప్పినా కఠిన చర్యలు తీసుకుంది. ఆ వ్యాఖ్యల్ని డిజిటల్ స్ట్రీమింగ్ నుంచి కూడా తొలగించారు.
అలా కరణ్ జోహార్ని ఇద్దర్నీ వివాదంలో పడేసాడు. అంతకు ముందు.. ఆతర్వాత పలువురు సెలబ్రిటీల్ని కూడా కరణ్ శృంగార జీవితం గురించి అడిగిన ప్రశ్నలు అంతే హాట్ టాపిక్ గామారాయి. నేరుగా కరీనా కపూర్ ని అడగగా, వాటికి అమీర్ఖాన్ ధీటుగా బధులిచ్చి కరణ్ నోరు మూయించారు.