కోలీవుడ్ రేంజ్ పెరగాలంటే.. శంకర్ కొట్టాల్సిందే!

అయితే తమిళ ఇండస్ట్రీ కూడా బాహుబలి రేంజ్​లో సినిమాలు చేసి తమ సత్తా నిరూపించుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది.

Update: 2023-07-27 12:30 GMT

ఇప్పుడంటే రాజమౌళి సినిమాలతో బాక్సాఫీస్​ వద్ద వందల కోట్ల కలెక్షన్లను చూస్తోంది టాలీవుడ్. కానీ ఇలాంటి ఘనతను కోలీవుడ్ ఎప్పుడో అందుకుంది. అందుకు కారణం తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్. ఆయన​ సినిమాలకు అప్పట్లోనే ఇండియా వైడ్​గా భారీ క్రేజ్ ఉండేది. శంకర్​ సినిమా అంటే హంగులకు కొరతే ఉండది కాదు. ప్రతీ సన్నివేశం లార్జన్‌ దేన్‌ లైఫ్‌ అన్నట్టే చూపిస్తుంటారు. ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరణ చేస్తుంటారు.

ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్​ మెసేజ్​కు కమర్షియల్​ను జోడించి సినిమాలను ఎవరూ ఊహించని రేంజ్​లో తెరకెక్కిస్తారు. ఆయన తీసిన సోషల్​ మెసేజ్​ సినిమాలన్నీ హిట్టే. 1990ల్లో అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించేవి. తెలుగులోనూ ఆయన తన సినిమాలతో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈ చిత్రాలు బాగా ఆకట్టుకునేవి.

అయితే బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్​గా ఖ్యాతిని అందుకున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం రాజమౌళి. అయితే తమిళ ఇండస్ట్రీ కూడా బాహుబలి రేంజ్​లో సినిమాలు చేసి తమ సత్తా నిరూపించుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్​ తీశారు. కానీ రాజమౌళి మార్క్​ను, సక్సెస్​ను అందుకోలేకపోయారు. ఇప్పుడు సూర్య కంగువ అనే భారీ పీరియాడికల్​ సినిమా చేస్తున్నారు.

కానీ రాజమౌళికి దీటుగా తమిళంలో సినిమా తీయాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు శంకర్. కానీ ఆయన గత కొంతకాలంగా ఐ, రోబో 2.0 చిత్రాలతో భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఆయన మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన సోషల్​ మెసేజ్ ఓరియెంటెడ్​ చిత్రాల వైపు మొగ్గు చూపారు.

అలా ఆయన కమల్​ హాసన్ భారతీయుడు 2, రామ్​చరణ్​ గేమ్​ ఛేంజర్​ చిత్రాలతో మళ్లీ సోషల్ మెసేజ్ సినిమాల బాట పట్టారు. విజయ్ దళపతితోనూ ఓ పొలిటికల్​ డ్రామా చేస్తారని సమాచారం. అయితే ఇప్పుడు ఇండియన్​ 2 ను కూడా రెండు భాగాలుగా రూపొందించనున్నారని తెలుస్తోంది.

మరి ఆయన ఇప్పుడు ఈ ఇండియన్ 2, గేమ్​ ఛేంజర్​తో కోలీవుడ్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిసారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకో విషయమేమిటంటే ఈ ఇండియన్​ 2 హిట్​ అయితేనే ఇండియన్​ 3ని తెరకెక్కించే అవకాశం ఉంటుంది. మరోవైపు తమిళ ఇండస్ట్రీ కూడా బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ రేంజ్​లో భారీ హిట్​ను అందుకోవాలని ఆశిస్తోంది. మరి శంకర్​.. తన ఇండియన్ 2 చిత్రంతో తమిళ పరిశ్రమ రేంజ్​ను మరింత ఉన్నత స్థాయి తీసుకెళ్తారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News