ఆ నటి అత్తింటినే మర్చిపోయిందా?
ఈ మధ్యనే ఆ నటి అక్క కూడా ఇంటికొచ్చి ఓ కార్యక్రమానికి సంబం ధించి ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చిందిట
ఆ మధ్య కోలీవుడ్ స్టార్ కపుల్స్ చెన్నై నుంచి ముంబైకి షిప్ట్ అయిన సంగతి తెలిసిందే. అందుకు గల కారణాలు? ఏంటి అన్నది క్లారిటీ లేదు గానీ..చర్చకొచ్చిన సందేహాలైతే చాలానే ఉన్నాయి. కుటుంబ కలహాలు కారణంగా మారారని కొందరంటే? పిల్లల భవిష్యత్ కోసం ముంబై వెళ్లినట్లు మరికొన్ని కథలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తుంది. అయితే అప్పటి నుంచి ఆ జంట తిరిగి మళ్లీ చెన్నైకి వెళ్లడం జరిగినట్లు కనిపించలేదు.
సదరు హీరో సోలోగా వెళ్లి వస్తున్నాడు తప్ప! భార్యతో కలిసి వెళ్లడం లేదని టాక్ వినిపిస్తుంది. ఆ కోడలైతే ఏకంగా చెన్నై వెళ్లడం ఇష్టం లేదనే అభిప్రాయన్ని భర్తకు చెప్పిందిట. అందుకు ఆ భర్త కూడా భార్య మాటకు విలువిచ్చి ఇష్టప్రకారమే ఉండమని చెప్పారుట. ఆ రకంగా కోడలు అత్తింటి కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్యనే ఆ నటి అక్క కూడా ఇంటికొచ్చి ఓ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చిందిట.
భార్య భర్త పిల్లలు అందరూ కలిసి రావాలని పిలుపు చేసి వెళ్లిందిట. ఆ సంగతి పక్కనబెడితే ఆ నటి ఇప్పుడు మునుపటి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకు ముందు కేవలం తమిళ సినిమాలే చేసేది. రీసెంట్ గా మలయాళ చిత్రాలు ప్రారంభించింది. ఇదే కోవలో మళ్లీ బాలీవుడ్ లోనూ కంబ్యాక్ అవుతుంది. అక్కడ ప్రచార కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. అవసరం మేర భర్త సహకారం కూడా లభిస్తుంది. ఇటీవలే వెబ్ సిరీస్ లకు కూడా సైన్ చేస్తుందని సమాచారం.
మొత్తానికి భార్యా భర్తలిద్దరు పెద్ద ప్లానింగ్ తోనే ముంబైకి షిప్ట్ అయ్యారని చెప్పొచ్చు. అదే చెన్నైలో ఉంటే కెరీర్ పరంగా ఈ రకమైన గ్రోత్ కి అవకాశం ఉండదు. ముంబైలో ప్రయాణం కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. ముంబై బాలీవుడ్ కల్చర్ కి తగ్గట్టు సదరు నటిమణి తనని తాను మౌల్డ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది.