ఆ సక్సెస్ కూడా ఛాన్స్ తేవడం లేదా?
ఏ హీరోకి కథలు వినిపించిన ట్లు గానీ...స్టోరీ డిస్కషన్స్ లోనూ గానీ క్రియేటివ్ మేకర్ పేరు వినిపించలేదు.
క్రియేటివ్ మేకర్ కృష్ణవంశీ కష్టకాలం లో చేసిన ఒకే ఒక్క సినిమా 'రంగమార్తాండ'. ఆ సినిమా రిలీజ్ కోసం ఆయనెంతగా శ్రమించారో తెలిసిందే. ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత రకరకాల కారణాలతో డిలే అయింది. మధ్యలో కోవిడ్ ప్రభావం సినిమా పై తీవ్రంగా పడింది. ఎట్టకేలకు రిలీజ్ అయి సక్సెస్ అయింది. ఈ సినిమాతో వంశీ ఈజ్ బ్యాక్ అనిపించారు. రీమేక్ సినిమా అయిన ఎమోషన్ పండిచండంలో మరోసారి తనదైన మార్క్ పడింది.
ఈ సినిమా విజయంతో వంశీ మేకర్ గా బిజీ అయిపోతారాని విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. మరి ఆ రకమైన సన్నివేశం కనిపిస్తుందా? అంటే ఇంతవరకూ లేదనే చెప్పాలి. 'రంగమర్తాండ' రిలీజ్ అయి మూడు నెలలు అవుతుంది. ఏ హీరోకి కథలు వినిపించిన ట్లు గానీ...స్టోరీ డిస్కషన్స్ లోనూ గానీ క్రియేటివ్ మేకర్ పేరు వినిపించలేదు.
అప్పట్లో బాలయ్యకి 'రైతు' కథ చెప్పి మెప్పించారు. ఆ సినిమా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారంసాగింది. కానీ ఆ తర్వాత ఆ సినిమా వివరాలు కూడా బయటకు రాలేదు. ఆ సినిమా ఉందా? ఆగిపోయిందా? అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో 'రంగమార్తండ' సక్సెస్ తర్వాత అయినా రైతు ప్రాజెక్ట్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది గానీ..ఇంతవరకూ అదీ జరగలేదు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇస్తున్నట్లు కొన్ని నెలలవరకూ ప్రచారం సాగింది. కానీ ఆ ప్రచారం ఇప్పుడెక్కడా జరగలేదు. దీంతో వంశీ తదుపరి ప్లానింగ్ ఏంటి అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే సీనియర్ దర్శకులు వి.వి.వినాయక్..శ్రీను వైట్ల...దశరధ్ లాంటి వాళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.
ఇప్పుడీ జాబితా లో వంశీ పేరు చేరుపోయినట్లే? అని మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. మరి వీటికి క్రియేటివ్ మేకర్ ఎలాంటి పుల్ స్టాప్ వేస్తారో చూడాలి. ఆయన సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉండరు. వాటికి ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు.