మిస్ స్విట్జర్లాండ్ గొంతు కోసి ముక్కలు చేసిన భర్త
అటుపై వాటిని బ్లెండర్‌లో ఉంచాడు! మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్
ఇది భయానక వార్త. గగుర్పొడిచే హత్యోదంతం. వినడానికే దడ పుడుతుంది. ఆమె గొంతు కోసి, మెడ నులిమాడు. అటుపై శరీరభాగాలను చిద్రం చేసాడు. అటుపై వాటిని బ్లెండర్‌లో ఉంచాడు! మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్.
క్రిస్టినా జోక్సిమోవిక్ (38)కి ఎదురైన భయానక అనుభవమిది. ఆమెను కట్టుకున్న భర్త ఇంత ఘోరంగా చంపాడు. ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్‌లోని బాసెల్ నగరానికి సమీపంలో ఉన్న తన ఇంటిలోనే హత్యకు గురైంది. ఆమె భర్త థామస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
శవపరీక్ష నివేదిక ప్రకారం.. జోక్సిమోవిక్ శరీరంలో ప్రతి భాగాన్ని కత్తి, తోట కత్తెరలను ఉపయోగించి అతడు ఛిద్రం చేసాడు. ఆపై ఆమె శరీర భాగాలను హ్యాండ్ బ్లెండర్‌తో కత్తిరించి, ప్యూరీ చేసి రసాయన ద్రావణంలో కరిగించాడు.
ఫిబ్రవరి 13 రాత్రి జోక్సిమోవిక్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. భర్త అంతకుమునుపు మార్చిలో ఆమెను చంపినట్లు అంగీకరించాడు.
అయితే హత్యకు దారి తీసిన పరిస్థితులపై భర్త థామస్ ఇలా చెప్పాడు. ఆమె తనపై కత్తితో దాడి చేసిన తర్వాత తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించడంలో చంపాల్సి వచ్చిందని అన్నాడు. కానీ వైద్య నిపుణులు ఆత్మరక్షణకు ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు. ఆమె మరణానికి కారణం గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు.