కాస్మెటిక్ సర్జరీలపై కృతి సనోన్ అభిప్రాయమిదీ
కృతి తాజాగా ఎల్లే మ్యాగజైన్ కవర్ షూట్ లో మెరుపులు మెరిపించింది.
'మిమీ' చిత్రంతో జాతీయ అవార్డ్ అందుకోవడం కృతి కెరీర్ కి కీలక మలుపు. ఆ తర్వాత పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. అంతకుముందు వచ్చిన ఆదిపురుష్ పరాజయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత `క్రూ` సినిమాతో క్లీన్ బ్లాక్ బస్టర్ అందుకోవడం కృతికి కెరీర్ పరంగా కలిసొస్తోంది. ఇలాంటి ఉత్తమమైన దశలో, కీలక సమయంలో ఈ బ్యూటీ నిర్మాతగాను ఆరంగేట్రం చేసింది. కృతి తాజాగా ఎల్లే మ్యాగజైన్ కవర్ షూట్ లో మెరుపులు మెరిపించింది. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ వైరల్ గా మారుతున్నాయి.
కృతి సనన్ నటించి నిర్మించిన `దో పట్టి` ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కృతి పూర్తి స్వింగ్‌లో తన చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో బొటాక్స్, కాస్మెటిక్ సర్జరీల గురించి మాట్లాడింది. తాను అందంగా కనిపించడం కోసం.. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉండటం వల్ల ఒత్తిడిని అనుభవిస్తున్నానని అంది. అయితే అందం కోసం చికిత్స తీసుకునే వారి గురించి, కాస్మెటిక్ మార్పులకు లోనయ్యే వారి గురించి తాను తీర్పు చెప్పనని వ్యాఖ్యానించింది. యువతులు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా కనిపించాలనే ఒత్తిడిని అనుభవించడం తనకు ఇష్టం లేదని కృతి తెలిపింది.
శస్త్ర చికిత్స చేయించుకోవడం అనేది వారి ఇష్టం. దీనిపై నేను తీర్పు చెప్పను. మీ శరీరంలో కొంత భాగాన్ని మార్చడం ద్వారా బావుంటుందనిపిస్తే అది మీ ఇష్టం. అప్పుడు అది మీ నిర్ణయం. ఆ నిర్ణయంతో ఏం పొరపాటు జరిగినా ఎదుర్కోవాల్సింది కూడా మీరే.. అని కృతి అంది. ఇది మీ జీవితం, మీ శరీరం, మీ ముఖం. నేను దానికి తీర్పు ఇవ్వలేను. యువతులు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా కనిపించాలనే ఒత్తిడిని అనుభవించకూడదని నేను అర్థం చేసుకున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా కనిపించరని తాను కూడా అలా లేనని వివరించింది. మీరు వ్యానిటీపై ఆధారపడిన ఇలాంటి వృత్తిలో ఉంటే కొంతైనా అందంగా కనిపించాలని కోరుకుంటారు! అని కృతి చెప్పింది.
`దో పట్టి` చిత్రంలో కాజోల్, కృతి సనన్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో కృతి మొదటిసారి నిర్మాతగా మారింది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన `దో పట్టి`లో కృతి ద్విపాత్రాభినయం చేయగా, కాజోల్ హత్యాయత్నం కేసును ఛేదించే పోలీసుగా నటించింది.