నా నుంచి మరిన్నీ సీతాకోకచిలుకలు!
బాలీవుడ్ లో కృతి సనన్ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలిసిందే. చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
బాలీవుడ్ లో కృతి సనన్ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలిసిందే. చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసే స్థాయికి చేరుకుంది. ఇటీవలే `దో పత్తి` సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయింది. బ్లూ బటర్ ప్లై ఫిలింస్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థపై `దోపత్తి`ని నిర్మించి. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తోన్న `తేరే ఇష్క్ మే` సినిమాలో నటిస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడు నిర్మాతగా తన భవిష్యత్ ప్లానింగ్ గురించి రివీల్ చేసింది. ` నిర్మాతగా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన కథలు చాలా ఉన్నాయి. కెరీర్ లో నిర్మాత అనే దశను ఇప్పుడు ఆస్వాదిస్తున్నా. నా బ్లూ బటర్ ఫ్లై నుంచి మరిన్ని సీతాకొకచిలుకలు వస్తాయి. ఇప్పటివరకూ భారతీయ సినిమా తెరపై రాని కొత్త కథల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందుకోసం నా పరిశోధన ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది.
సినీ ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరిచే కథలతో సినిమాలు తీయాలన్నది నా లక్ష్యం. ఇప్పటి వరకూ నేను నటించిన ప్రాత్రల్ని కూడా సృష్టించుకునే అవకాశం ఇప్పుడు నా చేతుల్లో ఉండటం ఆనందంగా ఉంది. భవిష్యత్ లో సమాజానికి ఉపయోగ పడే చిత్రాలను నిర్మించే స్థాయికి చేరుకుంటానని ఆశిస్తున్నాను` అని అన్నారు.
ఈ అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే .మహేష్ హీరోగా నటించిన `వన్ నేనొక్కడినే` చిత్రలో ఈ భామనే హీరోయిన్ . అటుపై `దోచెయ్` సినిమా చేసింది. కానీ ఆ రెండు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. లక్కీగా అక్కడ క్లిక్ అయింది. వరుస విజయాలు అమ్మడిని స్టార్ గా నిలబెట్టాయి. ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా సినిమా `ఆదిపురుష్` లో సీతమ్మగా నటించింది. ఆ పాత్రతో టాలీవుడ్ లో సీతమ్మగా ఫేమస్ అయింది.