కృతి ప్రియుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

అందుకే ఇప్పుడు వ్యాపార‌వేత్త క‌బీర్ బ‌హియాతో ప్రేమ‌లో ఉందంటూ వ‌స్తున్న పుకార్ల‌కు అంద‌రూ స్పందిస్తున్నారు.

Update: 2024-08-03 00:30 GMT

కృతి సనన్ హిందీ చిత్ర‌సీమ‌తో పాటు టాలీవుడ్ కు సుప‌రిచితురాలు. త‌న న‌ట‌న‌కు భాష‌తో సంబంధం లేకుండా ఫ్యాన్సున్నారు. 1-నేనొక్క‌డినే- దోచేయ్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇటీవ‌లే ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆదిపురుష్ లో న‌టించింది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఈ భామ అభిమానుల‌ను సంపాదించుకుంది. అందుకే ఇప్పుడు వ్యాపార‌వేత్త క‌బీర్ బ‌హియాతో ప్రేమ‌లో ఉందంటూ వ‌స్తున్న పుకార్ల‌కు అంద‌రూ స్పందిస్తున్నారు.

అస‌లింత‌కీ ఎవ‌రా క‌బీర్ బహియా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. గ‌త కొంత‌కాలంగా కృతి గ్రీస్ లో విహార‌యాత్ర‌లో ఉంది. అక్క‌డ‌ తన 34వ పుట్టినరోజును ప్రియమైనవారితో జరుపుకుంది. గ్రీస్‌లో ని నూపుర్ సనన్, స్నేహితులతో కలిసి కృతి విహారయాత్రను ఆస్వాధిస్తోంది. అయితే ఈ వేడుక‌ల్లో త‌న‌ ప్రియుడు, UK-ఆధారిత వ్యాపారవేత్త కబీర్ బహియా కూడా పాల్గొన్నార‌ని ఫ్యాన్స్ గుర్తించారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌ప‌డిన ఫోటోలలో ఒక‌రికొక‌రు స‌న్నిహితంగా క‌నిపించార‌ని వారు నిర్ధారిస్తున్నారు. ఇది వారు ఘాడ‌మైన ప్రేమ‌లో ఉన్నట్లు ఊహాగానాలకు దారితీసింది. గ్రీకు ద్వీపమైన మైకోనోస్‌లో కృతి - కబీర్ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయ

ఇంత‌కీ ఎవ‌రీ క‌బీర్ బ‌హియా? అంటే అత‌డు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న వ్యాపార కుటుంబానికి చెందినవాడు. 1999లో జన్మించారు. అతడు మిల్‌ఫీల్డ్ స్కూల్‌లో చదివి 2018లో పట్టభద్రుడయ్యాడు. వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ కి అత‌డు య‌జ‌మాని. అతడి తండ్రి ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. వారి కుటుంబం UKలోని NRI కమ్యూనిటీలో సంపన్నమైనది... ప్రభావవంతమైనదిగా కనిపిస్తుంది.

అయితే కృతి కంటే కబీర్ దాదాపు తొమ్మిదేళ్లు చిన్న‌వాడు.. ఈ జంట త‌మ రిలేష‌న్ ని ఇంత ర‌హ‌స్యంగా ఉంచ‌డానికి కార‌ణాలేమిటో వెల్ల‌డి కావ‌డం లేదు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం... ఇరు కుటుంబాలు ఇంకా మ్యాచ్‌కు పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. అందువల్ల వారు దానిని అధికారికం చేయడానికి వేచి చూస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ సాధారణ స్నేహితుల ద్వారా కలుసుకున్నట్లు కూడా తెలుస్తోంది. కృతి -కబీర్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. కృతి అతడితో సమయం గడపడానికి లండన్‌కు ప్రయాణిస్తూనే ఉంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

కబీర్ ఇన్ స్టా ప్రొఫైల్ లో క్రికెట్ స్టార్‌లతో సన్నిహిత సంబంధాలను క‌లిగిన ఫోటోల‌ను షేర్ చేసాడు. అతడు భారత మాజీ కెప్టెన్ MS ధోనీ, అతడి భార్య సాక్షి ధోనీతో సన్నిహిత బంధాన్ని క‌లిగి ఉన్న ఫోటోల‌ను కూడా షేర్ చేసాడు.

వారు బంధువులు లేదా సన్నిహిత కుటుంబ స్నేహితులు అని కూడా తెలుస్తోంది. గతంలో హార్దిక్ పాండ్యా స‌హా ప‌లువురు క్రికెటర్ల వివాహ వేడుక‌ల్లో క‌బీర్ కనిపించాడు. అతని సామాజిక వర్గంలో రిషబ్ పంత్, కృణాల్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ వంటి క్రికెటర్లు కూడా ఉన్నారు. కబీర్ కూడా లండన్‌లోని ఎలైట్ సొసైటీలో ఒక భాగం. కింగ్ చార్లెస్‌తో జరిగిన కార్యక్రమంలో కూడా కనిపించాడు.

కృతి సనన్ - కబీర్ బహియా వెకేష‌న్ చర్చనీయాంశం కావడం ఇదే మొదటిసారి కాదు. ఇద్దరూ కలిసి న్యూ ఇయర్‌ని కూడా గడిపినట్లు సమాచారం. ఈ సంవత్సరం ప్రారంభంలో హోలీ వేడుకల సందర్భంగా ఈ జంట షికార్ల‌ను అభిమానులు గుర్తించారు. అదే సమయంలో ఫోటోలు వైరల్ అయ్యాయి. కృతి సనన్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇంకా మాట్లాడనప్పటికీ త‌న‌ మిస్టరీ మ్యాన్ గురించి మరింత సమాచారం సేకరించడానికి అభిమానులు త‌న‌ సోషల్ మీడియాను నిశితంగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News