ఉప్పెన పాప లవ్ ఇన్సూరెన్స్.. ఈ స్టైల్ చూశారా..

తమిళంలో లవ్ టుడే సినిమాతో ప్రేక్షకులకి చేరువ అయిన నటుడు ప్రదీప్ రంగనాథన్.

Update: 2024-08-20 11:32 GMT

తమిళంలో లవ్ టుడే సినిమాతో ప్రేక్షకులకి చేరువ అయిన నటుడు ప్రదీప్ రంగనాథన్. మొదటి సినిమాతోనే హీరోగా అలాగే దర్శకుడిగా కూడా ప్రదీప్ రంగనాథన్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లవ్ టుడే సినిమాతో ప్రదీప్ రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయాడు. ఈ యంగ్ హీరో చాలా రోజుల తర్వాత మరో ఇంటరెస్టింగ్ మూవీతో రాబోతున్నాడు.


విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)” టైటిల్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్ కి జోడీగా నటిస్తోంది. తమిళంలో కృతి శెట్టికి ఇది రెండో సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఈ బ్యూటీ కార్తీకి జోడీగా “వావాతియార్” అనే సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పింక్ కలర్ బ్యాగ్రౌండ్ లో సిమెంట్ కలర్ స్కర్ట్ లో కృతి శెట్టిని స్టైలిష్ గా ఈ లుక్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పోస్టర్ లుక్ బట్టి చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గానే ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందంట. ఒక మొబైల్ గాడ్జెట్ ఉపయోగించి హీరో తన ప్రియురాలి కోసం టైం ట్రావెల్ అయ్యి వచ్చే కథతో ఈ సినిమా ఉంటుందంట.

“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే టైటిల్ కూడా సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. 2025 ప్రథమార్ధంలో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందంట. కచ్చితంగా ప్రదీప్ రంగనాథ్ మొదటి చిత్రం తరహాలోనే ఈ “LIK” కూడా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ లో ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ఉంటుందనే మాట వినిపిస్తోంది.

తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేకపోతున్న కృతి శెట్టికి ఈ మూవీ ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి. విగ్నేష్ శివన్ కథలు చెప్పే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే తమిళనాట ఈ “LIK” సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ అయ్యి ఉంది.

Tags:    

Similar News