అపర కుబేరుడు అయినా డేట్ కుదరట్లేదా..?
సినిమా సెట్స్ మీదకు వెళ్లి చాలా రోజులు అవుతున్నా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా కుబేర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్ తో పాటుగా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. సినిమాలో నాగార్జున వింటేజ్ లుక్ లో కనిపిస్తారని టాక్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లి చాలా రోజులు అవుతున్నా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు.
కుబేర సినిమా నుంచి ఆమధ్య ధనుష్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ధనుష్ లుక్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూపించిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత నాగార్జున గ్లింప్స్ వదిలి సర్ ప్రైజ్ చేశారు. ఐతే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుందని తెలుస్తుండగా రిలీజ్ ఎప్పుడు అన్న కన్ ఫ్యూజన్ మొదలైంది. మేకర్స్ కూడా సినిమాను ఈ ఇయర్ వదలాలా లేదా నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలా అన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతుందట.
ఈ ఇయర్ దసరా తప్ప మిగతా అన్ని స్లాట్స్ దాదాపు బుక్ అయ్యాయి. ధనుష్ సినిమా అటు తమిళంలో కూడా సరైన రిలీజ్ టైం చూడాలి. తెలుగు, తమిళంలో పోటీ లేనప్పుడే సినిమా రిలీజ్ చేయాలి. ఆ డేట్ మాత్రం కుదరట్లేదని తెలుస్తుంది. కోలీవుడ్ లో దీపావళి పెద్ద పండుగ ఆ టైం లో సినిమాలు రిలీజ్ చేయాలని వారు సెంటిమెంట్ గా భావిస్తారు. మరి ధనుష్ కుబేర దీపావళికి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అన్నది చూడాలి.
కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ స్టోరీ టెల్లింగ్ తో ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల తన పంథా మార్చి చేస్తున్న సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల మార్క్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ధనుష్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ కుబేరని టాప్ ప్లేస్ కి తీసుకెళ్తాయని అంటున్నారు. మరి ఈ సినిమా తో శేఖర్ కమ్ముల ఏ రేంజ్ కి వెళ్తాడన్నది చూడాలి.